Delimitation Bill: మహిళా కోటా కోసం డీలిమిటేషన్ బిల్లు.. 15-18 ఓట్లు అదనంగా వస్తాయని కేంద్రం ధీమా!
- మహిళా కోటా కోసం డీలిమిటేషన్ బిల్లు..
- ప్రత్యే్క పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం..
- మూడింట రెండొంతుల మెజారిటీపై కేంద్రం ధీమా..
- మెజారిటీ కన్నా 15-18 సీట్లు అధికంగా వస్తాయని అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delimitation: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్ బిల్లు), మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ఈ బిల్లుల్ని ఆమోదింపచేసుకోవడానికి కావాల్సిన మద్దతు కూడగట్టే పని ఇప్పటికే తెర వెనక జరుగుతోంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదింపచేసుకోవడానికి మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. సభలో 361 ఓట్లు సాధించాల్సి ఉంది.
మెజారిటీ కన్నా ఎక్కువ ఓట్లపై కేంద్రం ధీమా..
అయితే, మెజారిటీ సాధించే విషయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఫుల్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. 361 ఓట్ల కన్నా 15-18 ఓట్లు అదనంగా వస్తాయని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఈ బిల్లుల ఆమోదానికి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. అయితే, ఈ సమావేశాలు ఎప్పుడు ఉంటాయనే దానిపై స్పష్టత లేదు.
Also Read
- UP Elections 2027: యూపీలో బీజేపీదే పైచేయి.. సీఎంగా యోగికే మద్దతు.. లేటెస్ట్ సర్వేలో కీలక విషయాలు..
- Assam: అస్సాంలో ఘోర ప్రమాదం.. ట్రక్కు–మినీ బస్సు ఢీ, 23 మంది మృతి!
- Nvidia CEO: ఎన్విడియా పగ్గాలు భారత సంతతి వ్యక్తికి దక్కేనా? రేసులో ముగ్గురు!
- Paytm Services: పేటీఎం వినియోగదారులకు శుభవార్త.. ఆ సేవలకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..
మహిళలకు పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే ఈ బిల్లుల ముఖ్య ఉద్దేశం. ఇందు కోసం లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న ఎంపీల సంఖ్య 543 నుంచి 850కి పెంచాలని కేంద్రం యోచిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ఈ స్థానాలు పెంచాలని చూస్తోంది. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్లను అమలులోకి తీసుకురావాలని బీజేపీ లక్ష్యం పెట్టుకుంది.
ఏప్రిల్‌లో వీగిపోయిన బిల్లు.. ప్రత్యేక సమావేశాలకు ఛాన్స్..
మహిళా రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లును ఏప్రిల్ 17న బడ్జెట్ సమావేశాల ప్రత్యేక భేటీలో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే, బిల్లు ఆమోదానికి కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీని సాధించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఆ బిల్లుకు అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓట్లేశారు. దీంతో బిల్లు ఆమోదం పొందలేదు.
మరోవైపు, పార్లమెంట్ వర్షాకల సమావేశాలు ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఆ సమావేశాలు అధికారికంగా ప్రొరోగ్ కాలేదు. దీంతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ఎప్పుడైనా జరిగే అవకాశం ఏర్పడింది.
దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాల పరిశీలన..
లోక్‌సభ స్థానాల సంఖ్య 850 వరకు పెంచే ప్రతిపాదనలో భాగంగా ప్రతీ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎంపీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్రం భావిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనల్ని కూడా పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న స్థానాల నిష్పత్తిని 1971 జనాభా లెక్కల ఆధారంగా యథాతథంగా కొనసాగించే ప్రతిపాదన కూడా చర్చలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలను చెబుతున్నాయి. మెరుగైన జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందని దక్షిణాది నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Delimitation Bill: మహిళా కోటా కోసం డీలిమిటేషన్ బిల్లు.. 15-18 ఓట్లు అదనంగా వస్తాయని కేంద్రం ధీమా!
-
Dil Raju: ‘టాక్సిక్’ నష్టాల ప్రచారం అంతా పెయిడ్ గేమ్.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!
-
Pawan Kalyan – Dil Raju: మళ్లీ సెట్ కాబోతున్న ‘వకీల్ సాబ్’ కాంబో.. దిల్ రాజు ఇంట్రెస్టింగ్ హింట్!
-
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు ఎంతో అనుకూలం
-
UP Elections 2027: యూపీలో బీజేపీదే పైచేయి.. సీఎంగా యోగికే మద్దతు.. లేటెస్ట్ సర్వేలో కీలక విషయాలు..
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?