YouTube: యూట్యూబ్ తప్పుడు "థంబ్‌నెయిల్స్", "టైటిల్స్"పై చర్యలకు తీసుకునేందుకు సిద్ధమైంది. వినియోగదారుల్ని మోసగించే విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు కొత్త పాలసీని తీసుకురాబోతోంది. చాలా సందర్భాల్లో యూట్యూబ్‌లో వ్యూస్ కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉండే ‘‘క్లిక్‌బైట్’’ వీడియోలపై కఠినంగా వ్యవహరించనుంది.
యూట్యూబ్‌లో ఆసక్తికరమైన థంబ్‌నెయిల్ కనిపిస్తే చాలు.. అందులో ముఖ్యమైన సమాచారం ఉంటుందేమోనని యూజర్లు వెంటనే వాటిని ‘క్లిక్’మనిపిస్తారు. తీరా ఓపెన్ చేశాక, ‘సోది ఎక్కువ మేటర్ తక్కువ’ అన్నట్టుగా ఆ వీడియోలు సాగుతాయి. ఎక్కడ రెండు ముక్కల్లో ఉండే అసలు మేటర్ కోసం, మిగతా సోదిని భరించాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు యూట్యూబ్ సరికొత్త ఫీచర్‌ని తీసుకొస్తోంది. అదే.. ‘మోస్ట్ రీప్లేడ్’! ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఒక వీడియోలో యూజర్లు…