Site icon NTV Telugu

YouTube: యూట్యూబ్‌కు అంతరాయం.. యూజర్ల ఆందోళన

Youtube

Youtube

గత శుక్రవారం మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్యతో ప్రపంచ మంతా అల్లాడిపోయింది. తాజాగా భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వీడియో ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, ముంబై సహా పలు నగరాల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. అప్‌లోడ్ చేసిన వీడియోలు కనిపించడం లేదని, ఇంకొందరు అప్‌లోడ్ చేయలేకపోతున్నామని కంప్లంట్ చేస్తున్నారు. మరికొందరు డౌన్‌లోడ్ కావడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. మధ్యాహ్నం 1:40 గంటల నుంచి ఈ సమస్య ఉన్నట్లుగా వినియోగదారు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: AI Fashion Show : ఫ్యాషన్ షోలో దేశాధినేతల ర్యాంప్ వాక్.. మాములుగా లేదుగా..

గత శుక్రవారం మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్య కారణంగా మార్కెట్లు, బ్యాంకులు, ఎయిర్‌లైన్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొత్తానికి 24 గంటల తర్వాత సమస్యను పరిష్కరించారు. తాజాగా యూట్యూబ్ సమస్యతో ఇండియాలోని పలు ప్రాంతాల్లో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: Operation Raavan: సినిమా ప్రారంభమైన గంటలోపు అది కనిపెడితే.. సిల్వర్ కాయిన్!

Exit mobile version