Anantha Padmanabha Swamy Temple: అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో అద్భుతం.. చనిపోయిన బబియా స్థానంలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళ: కాసర్‌గోడ్‌లోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం ప్రత్యేకత గురించి అందరికి తెలిసిందే. దేశంలోనే అంతులేని సంపదకు ఇది చాలా ప్రసిద్ధి. ఆలయంలోని నేలమాళిగలల్లో రాశుల కొద్ది బంగారం, వజ్రవైఢ్యూర్యాలు, స్వర్ణ విగ్రహాలు ఉన్నాయనే ఓ వార్త ప్రచారంలో ఉంది. దీనితో పాటు ఈ ఆలయానికి మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. గుడిలో సరస్సులో ఉండే బబియా మొసలి. ఈ టెంపుల్‌కి వచ్చినవాళ్లు.. దానిని సందర్శించకుండ వెళ్లరు. ఎందుకంటే ఇది శాఖహార మొసలి. భక్తులు ఇచ్చే పండ్లుఫలహారాలు తప్పు మరేవి తినదు. అందుకే గుడికి వచ్చిన భక్తులు ఈ మొసలిని చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. దాదాపు 70 ఏళ్లుగా ఈ మొసలి ఆ సరస్సులో నివస్తుందని, అది కేవలం శాఖహారం మాత్రమే తినడం విశేషం. అయితే ఎన్నో ఏళ్లుగా ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ ముసలి గతేడాది అక్టోబర్ 9, 2022న మరణించిన సంగతి తెలిసిందే.
Also Read: Salaar: ఒరేయ్.. ప్రభాస్ లేకుండా ఐటెంసాంగ్ ఏంటి రా.. బాబు .. ?
Also Read
ఆలయ అధికారులు, అర్చకులు దానికి ప్రత్యేక పూజలు చేసి సంప్రదాయం ప్రకారం అంత్యసంస్కరణలు జరిపారు. అయితే ఇప్పుడు ఈ ముసలి స్థానంలో మరో ముసలి సరస్సులో దర్శనం ఇచ్చింది. అది చూసి అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మొసలి ఎక్కడి నుంచి వచ్చింది.. ఎలా వచ్చిందనేది అంతుచిక్కని విషయం. ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి సరస్సులో కనిపించడం అనివార్యంగా వస్తోంది. కానీ ఇలా ఎందుకు జరుగుతుందనేది నేటికి మిస్టరీగానే ఉంది. ఎప్పుడై ఒక మొసలి మాత్రమే ఈ సరస్సులో నివసిస్తుంది.. అదికూడా ఎవరికి హాని చేయకుండ పూజారి పెట్టే ప్రసాదం, భక్తులు ఇచ్చే ఫలాలు తింటూ శాఖహారిగా జీవించడం విచిత్రం. అంతేకాదు సరస్సులో ఉండే చేపలను అసలు ముట్టుకోదట.
Also Read: Vijay Devarakonda-Rashmika : మళ్ళీ దొరికిపోయిన విజయ్, రష్మిక.. ఆ ఫొటోతో బుక్కయ్యారు..
ఈ బబియా అనే మొసలి మూడోవది కాగా తాజాగా కనిపించింది నాలుగవ ముసలి అట. బబియా చనిపోయే ముందు దాని వయసు 70 ఏళ్లకు పైనే ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఒకప్పుడూ ఈ సరస్సులో పెద్ద మొసలి ఉండేదని దాన్ని ఆంగ్లేయులు కాల్చి చంపేయగా దాని స్థానంలఅో మరో మొసలి ప్రత్యక్షమైనట్లు ప్రజలు తెలిపారు. అది కూడా చనిపోయాక ఈ బబియా వచ్చింది. ఈ బబియా చనిపోయాక దాని అంత్యక్రియలు చూడటానికి రాజకీయ నాయకులతో సహా వేలాది మంది భక్తులు తరలిరావడం కూడా చర్చనీయాంశమయ్యింది. మళ్లీ ఆ మొసలి స్థానంలో మరో మొసలి రావడం అందర్నీ సంబ్రమాశ్చర్యాలకు గురి చేయడమే గాక భాగవత పురాణంలోని గజేంద్ర మోక్ష కథను గుర్తు చేస్తోంది. నిజానికి మొసళ్లు ఉన్నాయనేలా ఆ ఆలయం సమీపంలో నది లేదా సరస్సు కూడా లేదు. కేవలం ఆలయం కోనేరులోనే కనపించడం విచిత్రం అయితే ఎవరికి హాని తలపెట్టకుండా ఉండటం మరో విచిత్రం.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!