Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సలార్. ఈ సినిమాపై అభిమానులే కాదు ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది. కెజిఎఫ్ సినిమాతో ఇండియాను షేక్ చేసి.. ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఇక ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సలార్. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఎన్నో వాయిదాల తరువాత డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి నుంచి కూడా ఈ సినిమా షూటింగ్ పై ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. ఎన్నోసార్లు ఈ సినిమా వాయిదా పడడానికి కారణం.. చేసిన సీన్సే మళ్లీ మళ్లీ చేయడం అని సమాచారం.
Vijay Devarakonda-Rashmika : మళ్ళీ దొరికిపోయిన విజయ్, రష్మిక.. ఆ ఫొటోతో బుక్కయ్యారు..
ఇక ఈ చిత్రంలో కేవలం రెండే రెండు సాంగ్స్ ఉండనున్నాయని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. అందులో ఒకటి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అయితే.. ఇంకొకటి ఐటెంసాంగ్. ఈ సాంగ్ లో డర్టీ హరి భామ సిమ్రత్ కౌర్ డ్యాన్స్ చేయనుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఐటెంసాంగ్ లో ప్రభాస్ కనిపించడట. సాధారణంగా ఐటెంసాంగ్ లో హీరో, స్పెషల్ హీరోయిన్ చేసే రొమాన్స్ కోసమే చాలామంది థియేటర్ కు వెళ్తారు. ఇక సిమ్రత్ అందాలతో రచ్చ చేస్తుంటే.. ప్రభాస్ హుక్ స్టెప్స్ ఉంటాయని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలాంటివారికి ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే.. ఇది సినిమా అయిపోయాక షూట్ చేసిన సాంగ్ కావడంతో ప్రభాస్ లేడని అంటున్నారు. దీంతో ఒరేయ్.. ప్రభాస్ లేకుండా ఐటెంసాంగ్ ఏంటి రా.. బాబు .. ? మరి ఈ సాంగ్ తో ప్రశాంత్.. అభిమానులను ఎలా కన్విన్స్ చేస్తాడో చూడాలి.