Delhi Floods: యమునా నది ఉధృతం.. ఇళ్లల్లోకి వచ్చేసిన నీరు.. స్కూళ్లు, ఆఫీసులు మూసివేత
- ఢిల్లీలో యమునా నది ఉధృతం
- ఇళ్లల్లోకి వచ్చేసిన నీరు
- స్కూళ్లు, ఆఫీసులు మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రధాన ప్రాంతాలన్నీ అతలాకుతలం అయ్యాయి. రహదారులన్నీ నదులు తలపిస్తున్నాయి. ఎటుచూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. దీంతో పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. ఇక గురుగ్రామ్‌లో అయితే 7 కి.మీ పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు నరకయాతన పడ్డారు.
ఇది కూడా చదవండి: UP: యూపీలో ఘోరం.. చెల్లిని ప్రేమించాడని ఓ అన్నయ్య ఘాతుకం.. ప్రియుడిని బయటకు తీసుకెళ్లి..!
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇక భారీ వర్షాలు కారణంగా యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాద స్థాయిని దాటి ఉప్పొంగుతోంది. దీంతో వరద నీరు ఇళ్లల్లోకి వచ్చేసింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచిస్తున్నారు. సాయంత్రానికి యమునా నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని.. తక్షణమే లోతట్టు ప్రాంత ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Gurgaon: భారీ వర్షంతో గురుగ్రామ్ అతలాకుతలం.. 7 కి.మీ ట్రాఫిక్ జామ్.. వాహనదారులు బెంబేలు
యమునా నదితో పాటు మరికొన్ని నదుల నీటి మట్టాలు కూడా భారీ పెరిగాయి. దీంతో యమునానగర్ జిల్లాలోని హత్నికుండ్ బ్యారేజీ వరద గేట్లను అధికారులు ఎత్తేశారు. దీంతో ముందు జాగ్రత్తగా మంగళవారం పాఠశాలలు మూసేయాలని అధికారులు ఆదేశించారు. ఇక సెప్టెంబర్ 5 వరకు ఫీల్డ్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. ఇక ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని ముఖ్యమంత్రి రేఖా గుప్తా కోరారు. నది పర్యావరణ వ్యవస్థలో భాగంగానే యమునా నీరు మైదనంలోకి వస్తుందని చెప్పారు.
మంగళవారం తెల్లవారుజామున యమునా నది నీటి మట్టం ప్రమాద స్థాయి 205.33 మీటర్లు దాటింది. సాయంత్రం నాటికి నీటి మట్టం 206.50 మీటర్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేశారు. సోమవారం కేవలం నాలుగు గంటల్లోనే గురుగ్రామ్‌లో 100 మి.మీ.కు పైగా వర్షం కురిసింది. దీంతో హీరో హోండా చౌక్-ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వంటి కీలక ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఇక మంగళవారం కూడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 4 వరకు ఢిల్లీలో ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. ప్రతిరోజూ వర్షాలు ఉంటాయని చెప్పింది. ఇక వర్షాలు కారణంగా ఉద్యోగులంతా ఇళ్ల నుంచే పని చేయాలని అధికారులు కోరారు.
#WATCH | Delhi | Drone visuals from Loha Pul, where the Yamuna River is flowing above the danger level following incessant rainfall since yesterday
Traffic and public movement on Loha Pul to be stopped from 5 pm on 2nd September due to rising water level in the Yamuna River, as… pic.twitter.com/HrLrbbKsj3
— ANI (@ANI) September 2, 2025
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!