PM Modi: నారీశక్తి బిల్లుకు అండగా ఉందాం.. దేశ ప్రజలకు మోడీ పిలుపు
- 2047 నాటికి భారత్ వికసిత్ భారత్ లక్ష్యం
- నారీశక్తిని ప్రోత్సహిస్తేనే సాధ్యమవుతుంది
- దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2047 నాటికి భారత్ వికసిత్ భారత్‌గా మారాలంటే నారీశక్తిని ప్రోత్సహిస్తేనే సాధ్యమవుతుందని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. ‘‘2047 నాటికి… భారతదేశ స్వాతంత్ర్యం వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే సమయానికి… ‘‘వికసిత్ భారత్’’ లక్ష్యాన్ని సాధించాలని భారతదేశం సంకల్పించింది. అయితే గత రెండున్నర దశాబ్దాలుగా ప్రభుత్వ అధినేతగా నాకున్న అనుభవం ఆధారంగా నేను చెప్పగలిగేది ఏమిటంటే.. మనం ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించాలంటే.. మన ‘మాతృ శక్తి’ని, మన ‘నారీ శక్తి’ని దేశాభివృద్ధిలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చేయాలి.’’ అని మోడీ కోరారు.
‘‘2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మన దేశంలోని ‘నారీ శక్తి’కి లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో ప్రజా ప్రతినిధులుగా 33 శాతం ప్రాతినిధ్యం లభించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా మేము అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాము. చాలా వరకు పార్టీలు తమ మద్దతును తెలియజేశాయి. ప్రస్తుతం ఒక అత్యంత సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఈ అంశాలపై ఈ రోజు నేను వార్తాపత్రికల్లో ఒక వ్యాసం రాశాను. అందులో నా ఆలోచనలను పంచుకున్నాను. దయచేసి మీరు ఆ వ్యాసాన్ని చదవాలని.. అలాగే ఇతరులు కూడా చదివేలా ప్రోత్సహించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.’’ అని ప్రజలకు మోడీ పిలుపు నిచ్చారు.
Also Read
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
‘‘అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీలను కూడా మీరు ప్రేరేపించి ప్రోత్సహించాలి. ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో పార్లమెంటులో సమావేశమైనప్పుడు ఈ బిల్లును ఆమోదించి.. అందరం కలిసి ఆ విజయాన్ని సంబరంగా జరుపుకోగలుగుతాము.’’ అని మోడీ పేర్కొన్నారు.
#WATCH | Women's Reservation Bill | PM Narendra Modi says, "…India has resolved that by 2047 when we complete 100 years of independence, we must achieve goal of Viksit Bharat. But from my experience of being the Head of Government for the past two-and-a-half decades, I can say… pic.twitter.com/8NGPs0KFUC
— ANI (@ANI) April 9, 2026
తాజావార్తలు
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
-
Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
-
Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!