కర్ణాటకలో ఓ తల్లి ఘాతుకానికి పాల్పడింది. నవమాసాలు మోసి కని పెంచిన కన్నబిడ్డను అత్యంత దారుణంగా హతమార్చింది. అనంతరం తల్లి కూడా ప్రాణాలు తీసుకుంది. ఈ ఘోరం శివమొగ్గలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Keerthy Suresh : తీరం దాటిన ‘కీర్తి సురేష్’ అందాలు.. బలమైన సొగసుల గాలులు వీచే అవకాశం
కర్ణాటకలోని శివమొగ్గలోని ప్రభుత్వాస్పత్రి నర్సుల క్వార్టర్స్‌లో ఒక కుటుంబం నివాసం ఉంటుంది. కుటుంబ యజమాని ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. రాత్రి యథావిధిగా భర్త రాత్రి షిఫ్ట్‌కు వెళ్లిపోయాడు. ఇంట్లో భార్య శృతి (38), కుమార్తె పూర్విక (12) ఉన్నారు. భర్త నైట్ షిఫ్ట్ ముగించుకుని ఇంటికొచ్చేసరికి తలుపులు వేసి ఉన్నాయి. అనుమానం వచ్చి ఇరుగుపొరుగు వారిని పిలిచి తలుపులు పగులగొట్టి చూడగా ఇద్దరు మృతదేహాలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా భర్త కుప్పకూలిపోయాడు. కన్నీరుమున్నీరుగా విలపించాడు.
ఇది కూడా చదవండి: Bomb Threats: చంద్రబాబు, జగన్ ఇళ్లకు బాంబు బెదిరింపులు..
అయితే భార్య.. కుమార్తెను చంపి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. ఈ సంఘటన ప్రభుత్వాస్పత్రిలోని నర్సుల క్వార్టర్స్‌లో జరిగింది. కుమార్తె పూర్విక ఆరో తరగతి చదువుతోంది. ఇక పూర్విక తలకు గాయాలు అయ్యాయి. భార్య శృతి వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. శృతి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కుమార్తెను చంపి శృతి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. పోలీసులు హత్య, అసహజ మరణం కింద కేసు నమోదు చేసి ఇతర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Tollywood Actress : లక్కీ హీరోయిన్ చేతిలో 8 సినిమాలు..అన్ని బడా సినిమాలే