Woman Birth to Five Children: ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జననం.. కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Birth to Five Children: మహిళలు కవల పిల్లలకు జన్మనివ్వడం సాధారణ విషయమే, కొందరు మహిళలు ఒకే సారి ముగ్గురు లేదా నలుగురు పిల్లలకు జన్మనిస్తుంటారు. అయితే ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని కరౌలీ జిల్లాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఆ దంపతులకు ఈ ఆనందం ఎంతో సేపు లేకుండా పోయింది. పుట్టిన పిల్లల్లో ముగ్గురు వెంటనే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి ఆరోగ్యం నిలగడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వీరిని మెరుగైన వసతులు ఉన్న జైపూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
కరౌలీలో నివసింటే అష్రఫ్ అలీ భార్య రేష్మకు పురుటినొప్పులు రాగా.. ఆమె స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేర్పించారు. సాధారణ ప్రసవం ద్వారానే మహిళ ఐదుగురు శిశువులకు జన్మనిచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. ఆ పుట్టిన పిల్లల్లో ఇద్దరు మగపిల్లలు కాగా.. ముగ్గురు బాలికలు జన్మించినట్లు వెల్లడించారు. పెళ్లయిన ఏడేళ్లకు సంతానం కలగడంతో ఆనందానికి గురైన ఆ దంపతులకు సంతోషం ఎంతో సేపు నిలవలేదు. పుట్టిన కాసేపటికే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ దంపతులకు ఆనందం లేకుండా పోయింది. ఏడో నెలలోనే గర్భం నుంచి బయటకు వచ్చారని.. నెలలు నిండక ముందే జన్మించడం వల్ల శిశువులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
Gudivada Mystery Case: మొదట అబ్బాయి అదృశ్యం.. ఆ తర్వాత ఎదురింట్లో ఆంటీ మాయం
పుట్టిన చిన్నారులకు మెరుగైన చికిత్స అవసరమని భావించిన వైద్యులు.. శిశువులను కరౌలీలోని మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పిల్లలు చనిపోయారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే ఒకే కాన్పులో ఐదుగురు చిన్నారులు జన్మించడం అరుదుగా జరుగుతుందని వైద్యులు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!