గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించింది.. బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేసిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సూరత్ (తూర్పు) నియోజవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న కంచల్ జరీవాల్ కనిపించకుండా పోయారని ట్వీట్ చేసిన ఆయన.. నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని కంచల్ జరీవాల్ పై ఒత్తిడి చేశారని, ఇప్పుడు కనిపించకుండా పోయారని రాసుకొచ్చారు. అయితే, ఈ వ్యవహారంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్…