హర్యానాలో రైతులు..భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది, జజ్జర్‌లో ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతులను ఆపడానికి నీటి ఫిరంగులను ప్రయోగించారు పోలీసులు. అయితే… నల్ల జెండాలతో రైతులు ముందుకే సాగిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు-రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల దగ్గర నెలల తరబడి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక..ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు తమ విధులకు ఆటంకం కలిగించొద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. హర్యానా, పంజాబ్‌లో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ నిర్ణయానికి వచ్చింది.. అందులో భాగంగా రేపు అనగా శనివారం రోజు హర్యానాలోని అధికార బీజేపీ, జేజేపీ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.. ఇక, పంజాబ్‌లోని అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల వద్ద రైతులు నిరసన తెలియజేయాలని భారతీయ కిసాన్ యూనియన్‌కు చెందిన రైతు నేత రాకేశ్ తికాయిత్ పిలుపునిచ్చారు.
రేపు ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర రైతుల నిరసన
