మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ తో 15 నెలలుగా రైతులు చేస్తున్న ఆందోళనకు నేటితో ముగుస్తోంది. పోరుబాటను వీడి పొలం బాట పట్టనున్నారు రైతులు. ఢిల్లీలోని సింఘు, తిక్రీ ఘాజీపూర్ సరిహద్దుల్లో గుడారాల్లో ఉంటూ ఆందోళన చేసిన రైతులు పంజాబ్, హర్యానాలోని తమ తమ గ్రామాలకు విజయ యాత్రతో తిరిగి వెళ్తున్నారు. ట్రాక్టర్లపై ఇళ్ళకు వెళ్తున్న రైతులకు స్వాగతం పలికేందుకు హైవేల వెంబడి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయయాత్ర ను ముందుగా నిన్ననే నిర్వహించాలని…
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ… దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన పై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ స్పందించారు. తమ పోరాటం ఇప్పుడే ఆపేయమని స్పష్టం చేశారు. ఈ రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంట్ లో రద్దు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగు తుందని తెలిపారు. అలాగే… కనీస మద్దతు ధర గురించి… ప్రభుత్వం రైతులతో చర్చించాలని డిమండ్ చేశారు రాకేష్ టికాయత్. కాగా… ఇవాళ జాతిని ఉద్దేశించి……
హర్యానాలో రైతులు..భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది, జజ్జర్‌లో ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతులను ఆపడానికి నీటి ఫిరంగులను ప్రయోగించారు పోలీసులు. అయితే… నల్ల జెండాలతో రైతులు ముందుకే సాగిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు-రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల దగ్గర నెలల తరబడి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక..ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు తమ విధులకు…