ఒక్క చిన్న వైరస్.. వందలాది దేశాలను వణికించింది. ఒకటి కాదు రెండేళ్ళకు పైనే అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. లక్షలాదిమంది ఆ మహమ్మారికి బలయిపోయారు. కరోనా వైరస్ ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా దిగిరావడంతో అనేక దేశాలు నిబంధనలు వదిలేశాయి. మనదేశంలో 25వేలకు లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. నెలక్రితం ఈ సంఖ్య రెండు లక్షలకు పైమాటే. కరోనా తగ్గిందని జనం బయట యథావిధిగా విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. అంతేకాదు, కరోనా పరీక్షలను…