Shweta K Sugathan: రిపబ్లిక్ డే రోజున “మహిళా పోలీస్ మార్చ్”కి స్వేత కే సుగతన్ నాయకత్వం.. ఈమె ఎవరో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shweta K Sugathan: భారతదేశ గణతంత్ర వేడుకుల పరేడ్ చరిత్రంలోనే తొలిసారిగా ఢిల్లీ పోలీస్ బృందంలో మొత్తం మహిళా అధికారులు ఉండబోతున్నారు. నార్త్ డిస్ట్రిక్ట్, పోలీస్-II అడిషనల్ డిప్యూటీ కమీషనర్ అయిన ఐపీఎస్ అధికారి శ్వేతా కే సుగతన్ ఈ పరేడ్‌ని నాయకత్వం వహించనున్నారు. 75వ రిపబ్లిక్ డే పరేడ్కి ఓ మహిళా అధికారి ఇలా నేతృత్వం వహించనున్నారు.
ఢిల్లీ పోలీస్‌కి చెందిన 194 మంది మహిళా అధికారులు కర్తవ్య మార్గ్‌లో కవాతు చేయనున్నారు. నివేదిక ప్రకారం.. ఈ రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంటున్న వారిలో 80 శాతం మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఈశాన్య రాష్ట్రాల అసమానతలను తొలగించేందుకు ఢిల్లీ పోలీసులు 8 ఈశాన్య రాష్ట్రాల నుంచి పోలీసులను రిక్రూట్ చేసుకునే విధానాన్ని కలిగి ఉన్నారు.
Also Read
- TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
- Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
- FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
- Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
Read Also: Amarnath: నా భవిష్యత్తు జగన్ నిర్ణయిస్తారు.. నాకు ఎలాంటి గాభరా లేదు
కిరణ్ బేడీ తర్వాత శ్వేత కే సుగతన్:
గతేడాది శ్వేతా కే సుగతన్ రిపబ్లిక్ డే కంటెంజెంట్లో కూడా ఢిల్లీ పోలీసు బృందానికి (పురుష మరియు మహిళా అధికారులతో కూడిన) నాయకత్వం వహించారు. 48 ఏళ్ల చరిత్రలో ఇలా నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా ఈమె నిలిచారు. కిరణ్ బేడీ తర్వాత ఢిల్లీ పోలీస్ దళానికి నేతృత్వం వహించిన మహిళా కమాండర్‌గా నిలిచారు.
ఢిల్లీ పోలీసులు 1955లో మొదటిసారిగా రాజ్‌పథ్(కర్తవ్య మార్గ్)లో కవాతు చేశారు. 1975లో కిరణ్ బేడీ నాయకత్వం వహించి తొలి మహిళగా నిలిచారు. దాదాపు 5 దశాబ్ధాల తర్వాత శ్వేతా కే సుగతన్ వచ్చారు. 955 నుండి, ఢిల్లీ పోలీసులు 26 జనవరి పరేడ్‌లో 40 సార్లు బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ అవార్డును అందుకున్నారు.
ఎవరీ శ్వేతా కే సుగతన్.?
శ్వేతా కె సుగతన్ గత ఏడాది అక్టోబర్‌లో ఢిల్లీ పోలీసు అదనపు డిసిపి-II ఉత్తర జిల్లాగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆమె చాణక్యపురిలో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేశారు. శ్వేత సొంత రాష్ట్రం కేరళ. ఇండియన్ పోలీస్ సర్వీసెస్ యొక్క 2019 AGMUT కేడర్‌కు చెందినవారు. సుగతన్ 2015లో డిగ్రీ పట్టా పొందారు. 2019లో యూపీఎస్సీ పరీక్షని క్లీయర్ చేసి ఐపీఎస్ అయ్యారు. తొలుత చాణక్య పురిలో ఏసీపీగా నియమితులయ్యారు.
తాజావార్తలు
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
-
MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..