NTV Telugu Site icon

PM Modi: కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా ఉగ్రవాదం, నేరాలే..

Pm Modi

Pm Modi

PM Modi: రాజస్థాన్ పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించారు. భరత్ పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు విధానంతో సంఘ విద్రోహ శక్తులకు అవకాశం ఇస్తోందని మండిపడ్డారు. నేరాలు, అల్లర్లలో రాష్ట్రాన్ని టాప్ ప్లేస్‌లో ఉంచిందని విమర్శించారు.

కాంగ్రెస్ నేత, సీఎం అశోక్ గెహ్లాట్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ప్రజలు ‘‘జాదుగర్’’కి ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగు అవుతుందని అన్నారు. డిసెంబర్ 3న కాంగ్రెస్ ‘ఛూ మంతర్’ అని ఎద్దేవా చేశారు.

ఒకవైపు భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోంది.. మరోవైపు రాజస్థాన్‌లో గత ఐదేళ్లలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు అని ప్రధాని అన్నారు. రాజస్థాన్ రాష్ట్రాన్ని అవినీతి, అల్లర్లు, నేరాల్లో కాంగ్రెస్ అగ్రగామిగా నిలిపింది. అందుకే అశోక్ గెహ్లాట్‌కి ఓట్లు పడవని ప్రధాని అన్నారు.

Read Also: Rohit Sharma: ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో ఫోన్ రింగ్.. రోహిత్ శర్మ ఫైర్..!

కాంగ్రెస్ తన బుజ్జగింపు విధానాలతో నేరస్తులకు స్వేచ్ఛనిస్తోందని, కాంగ్రెస్ ఎక్కడ అధికారం వచ్చినా ఉగ్రవాదం, నేరస్తులు, అల్లరిమూకల్ని వదులుతుందని, కాంగ్రెస్ బుజ్జగింపులే సర్వస్వమని, మీ ప్రాణాలను పణంగా పెట్టైనా కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హోలీ, రామనవమి, హనుమాన్ జయంతి పండగ ఏదైనా మీరు ప్రశాంతంగా జరుపుకోలేరని, అల్లర్లు, రాళ్లదాడులు, కర్ఫ్యూ ఇవన్నీ రాజస్థాన్‌లో కొనసాగాయని పీఎం అన్నారు.

రాజస్థాన్ మహిళల విశ్వాసాన్ని కాంగ్రెస్ వమ్ము చేసిందని, మహిళలు నకిలీ రేప్ కేసులు పెడతారని ముఖ్యమంత్రి అంటున్నారని ఇలాంటి ముఖ్యమంతికి ఒక్క క్షణం కూడా కుర్చీలో కూర్చునే అర్హత ఉందా..? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి మహిళలకు రక్షణ కల్పించగలరా అని అడిగారు. నవంబర్ 25న రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉండనుంది.