PM Modi: రాజస్థాన్ పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించారు. భరత్ పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు విధానంతో సంఘ విద్రోహ శక్తులకు అవకాశం ఇస్తోందని మండిపడ్డారు. నేరాలు, అల్లర్లలో రాష్ట్రాన్ని టాప్ ప్లేస్‌లో ఉంచిందని విమర్శించారు.