CM Yogi: ‘‘ మీ ఇంటిని కాల్చి, మీ తల్లిని ఇస్లామిక్ మిలీషియా చంపడం మరిచిపోయారా ఖర్గే జీ?’’
- కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకి చరిత్ర గుర్తు చేసిన సీఎం యోగి..
- మీ ఇంటిని తగలబెట్టిన విషయం మరిచారా..?
- కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కోసం కుటుంబ త్యాగాన్ని మరిచారంటూ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వాడీవేడిగా కొనసాగుతోంది. ముఖ్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. మంగళవారం సీఎం యోగి మాట్లాడుతూ.. ఖర్గే చిన్నతనం నాటి ఘటనను గుర్తు చేశారు. సాధువులు, కాషాయం ధరించిన వారు రాజకీయం చేయొద్దని ఖర్గే చేసిన వ్యాఖ్యలు ధీటుగా బదులిచ్చారు.
‘‘ బ్రిటీష్ హయాంలో, అప్పటి రాజరిక రాష్ట్రం హైదరాబాద్‌లోని ఒక గ్రామంలో ఖర్గే ఇంటిని ఇస్లామిక్ మిలీషియా దహనం చేయడంతో ఆతడి తల్లి, కుటుంబ సభ్యులు మరణించారు. ఖర్గే తన భావాలను దాచుకుని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కోసం పనిచేస్తున్నారు’’ అని యోగి అన్నారు. ‘‘ఖర్గేకి నాపై కోపం ఉంది. కానీ యోగికి దేశం ముందుంటుంది. మీకు మాత్రం కాంగ్రెస్‌ని బుజ్జగించడమే ప్రధానం’’ అని యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
Read Also: Indira Eegalapati : సౌదీ అరేబియాలోని రియాద్ మెట్రోను నడపనున్న హైదరాబాద్ మహిళ
‘‘ఖర్గే గ్రామం నిజాం పాలనలోని హైదరాబాద్‌లో ఉండేది. భారతదేశం బ్రిటీష్ వారి ఆధీనంలో ఉన్నప్పుడు, హిందువులను టార్గెట్ చేసి చంపుతున్న సమయంలో ఖర్గే ఇంటికి నిప్పు పెట్టారు. తన తల్లి, కుటుంబ సభ్యులు చనిపోయారు. ఈ విషయం ఖర్గేకి తెలుసు కానీ ఓట్ల కోసం కుటుంబ త్యాగాన్ని మరిచిపోయారు’’ అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
అంతకుముందు, ఆదివారం ఖర్గే మాట్లాడుతూ.. ‘‘బాటేంగే తో కటేంగే’’ అనే యోగి నినాదాన్ని విమర్శించారు. “చాలా మంది (రాజకీయ) నాయకులు సాధువుల వేషధారణలో బతుకుతూ రాజకీయ నాయకులు అవుతారు.. కొందరు ముఖ్యమంత్రులు కూడా అవుతారు. గెరువ (కుంకుమ) బట్టలు వేసుకుంటారు, తలపై వెంట్రుకలు కూడా ఉండవు… తెల్లని బట్టలు ధరించి, సన్యాసివి అయితే రాజకీయాల నుంచి తప్పుకో” అంటూ ఖర్గే వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.
హిందువులు విడిపోతే, నాశనం అవుతారని యోగి ‘‘బాటేంగే తో కటేంగే’’ నినాదాన్ని తీసుకువచ్చారు. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత ఆ దేశంలో హిందువులపై దాడులను ఉద్దేశిస్తూ యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. హర్యానా ఎన్నికల్లో ఈ నినాదం వైరల్‌గా మారాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఈ నినాదం సంచలనంగా మారింది. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!