Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ మధ్య రైల్వే 2026 ఆగస్టు 24 నుంచి 26 వరకు తన జోన్ పరిధిలో నిర్వహించిన మూడు రోజుల భారీ టికెట్ తనిఖీ డ్రైవ్‌లో రూ. 1.28 కోట్లకు పైగా జరిమానాలు వసూలు చేసింది. పండుగలు, సెలవుల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అనధికారిక ప్రయాణాలను అరికట్టడం, అలాగే అసలైన ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 13,964 మందిని, బుక్ చేయని లగేజీతో ఉన్న 1,189 మంది ప్రయాణికులను గుర్తించి వారి నుంచి రూ. 1.28 కోట్ల రుసుము వసూలు చేశారు. వీటితో పాటు రైల్వే ఆవరణలో చెత్త వేసిన 37 మంది నుంచి రూ. 6,400, అనుమతి లేకుండా వ్యాపారం చేస్తున్న 5 గురి నుంచి రూ. 10,000, ధూమపానం చేసిన 7 గురి నుంచి రూ. 14,000 జరిమానాగా రాబట్టారు.
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
South Central Railway Conducts Massive Ticket Checking Drive Across the Zone @drmsecunderabad @drmhyb @drmned pic.twitter.com/fSZurPCwkn
— South Central Railway (@SCRailwayIndia) August 28, 2026
తనిఖీల సమయంలో ప్రయాణికులకు సరైన టికెట్లతో ప్రయాణించాల్సిన అవసరం, రైళ్లలో పొగతాగడం వల్ల కలిగే అగ్నిప్రమాదాలు, పరిశుభ్రత ప్రాముఖ్యతపై సిబ్బంది అవగాహన కల్పించారు. నిబంధనలు పాటిస్తూ ప్రయాణించాల్సిందిగా రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించిన వాణిజ్య విభాగాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అభినందించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!