* నేడు గణేష్ నిమజ్జన కార్యక్రమం… హుస్సేన్‌సాగర్ సహా హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఏర్పాట్లు..
* నేడు గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి…
* నేడు హైదరాబాద్ మెట్రో రైళ్ల సమయం పెంపు.. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీసులు
* గణేష్ నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్ దగ్గర భారీ ఏర్పాట్లు
* ఇవాళ ఉదయం నుంచి రేపు ఉదయం వరకు హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలు సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
* హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో నేడు సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం.
* హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఇవాళ, రేపు మద్యం షాపులు బంద్
* నేడు తెలంగాణలో అసోం సీఎం హిమంత్ బిస్వాశర్మ పర్యటన.. హైదరాబాద్, వరంగల్‌లో జరిగే గణేష్ నిమజ్జనంలో పాల్గొననున్న అసోం సీఎం..
* తూ.గో: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ గడువు.. ఆయన బెయిల్ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో వాదనలు
* ప్రకాశం : గిద్దలూరు మండలం తిమ్మాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు..
* ప్రకాశం : కొనకనమిట్ల మండలం తువ్వపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మార్కాపురం ఎమ్మెల్యే కేపీ. నాగార్జున రెడ్డి..
* పశ్చిమ గోదావరిజిల్లా: తాడేపల్లిగూడెం 3వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ..
* ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో నిర్మితం అవుతున్న పోలవరం పునరావాస కాలనీలను పరిశీలించనున్న పీపీఏ బృందం
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో అనంతపద్మనాభ వ్రతం, ఈ సందర్భంగా పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమాని నిర్వహించనున్న టీటీడీ, రేపు శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ, రేపు రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై మాడవీధులలో భక్తులుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ కానున్న ఎమ్మెల్సీ అనంతబాబు, తల్లి అంత్యక్రియలు కోసం హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఇవాళ జైలుకు అనంతబాబు
.
* నెల్లూరు జిల్లా: వెంకటగిరి, డక్కిలి మండలాలలోరైతు భరోసా కేంద్రాలను ప్రారంభించనున్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి
* నెల్లూరు: బోగోలులో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడప కూ ప్రభుత్వం కార్యక్రమం
* నెల్లూరు: ఎన్ సి.సి.నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ఎం.ఎల్.ఏ.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
* నెల్లూరు: విడవలూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం
* బాపట్ల జిలా: నేడు రేపల్లెలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ రావు.
* అనంతపురం : నేడు జిల్లాకు రానున్న మానవహక్కుల కమీషన్ సభ్యులు జస్టిస్ సుబ్రమణ్యం.
* అనంతపురం : గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోని అనంతపురం గుత్తి మార్గంలో ఇమాంపురం రైల్వే స్టేషన్ లో నేటి నుంచి ఆగనున్న ప్యాసింజర్ రైళ్లు.. నేటి నుంచి గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో అనంతపూర్ మీదుగా నర్సాపురం యశ్వంత్పూర్ మధ్య ప్రత్యేక రైలు ప్రయాణం
* గుంటూరు: నేటినుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 33వ సౌత్ జోన్ నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీలు, పాల్గొనున్న 910 మంది క్రీడాకారులు.
* నేడు కాకినాడ కార్పొరేషన్ కౌన్సిల్ సర్వ సభ్య ఆఖరి సమావే. ఈ నెల 15 తో ముగియనున్న ప్రస్తుత పాలక వర్గం గడువు
* గుంటూరు: నేడు జిల్లాలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన.. గుంటూరు సిద్దార్ద గార్డెన్స్ లో ఆత్మీయ సమావేశంలో పాల్గొనున్న వెంకయ్యనాయుడు, మధ్యాహ్నం విజ్ఞాన్ యూనివర్సిటీలో డెవలప్‌మెంట్ ఆఫ్ లీడర్ షిప్ క్వాలిటీస్ అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్న వెంకయ్యనాయుడు.
* చిత్తూరు: ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు పంచాయతీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి
* నంద్యాల: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నేడు డోన్ లో మెగా జాబ్ మేళా…
* కర్నూలు: కృష్ణగిరి మండలం పుట్లూరు లో శ్రీ మాతా మారెమ్మ బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు రాష్ట్రస్థాయి వృషభాల బండ లాగుడు పోటీలు…
* పల్నాడు: నేడు చిలకలూరిపేట 15 ,16 వార్డుల్లో గడప,గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని..