* నేడు విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ.. రెండు రోజుల పాటు పర్యటన.. ప్రధానికి స్వాగతం పలకనున్న గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం వైఎస్ జగన్..
* నేడు విశాఖలో ప్రధాని మోడీ రోడ్ షో.. మారుతి జంక్షన్ నుంచి రెండు కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో.. 30 వేల మంది కార్యకర్తలు, ఉత్తరాంధ్ర కళాబృందాలతో స్వాగతం పలకనున్న బీజేపీ నాయకత్వం
* సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన, ప్రధాని మోడీతో కలిసి పలు అభివృద్ది, శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి.. ఇవాళ సాయంత్రం విశాఖకు సీఎం.. రాత్రికి పోర్ట్ గెస్ట్‌హౌస్‌లో బస.. రేపు ప్రధానితో కలిసి పలు శంకుస్ధాపనలు, ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవాలలో పాల్గొంటారు. మధ్యాహ్నం ప్రధానికి వీడ్కోలు పలకనున్న ఏపీ సీఎం
* నేడు విశాఖకు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖకు పవన్.. రాత్రి చోళ అతిథిగృహంలో మోడీ, పవన్ కీలక భేటీ.. బీజేపీ ఆహ్వానంతోనే పవన్ వెళ్తున్నట్టు సమాచారం. ఈనెల 13 వరకు విశాఖలోనే పవన్.
* తిరుపతి: నేడు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం.. హాజరుకానున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్
* తూర్పుగోదావరి: నేడు జిల్లాలో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం పర్యటన.. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు అమలుపై సమీక్ష
* తిరుమల: ఇవాళ ఆన్ లైన్‌లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. ఉదయం 10 గంటలకు డిసెంబర్ మాసానికి సంబంధించిన టికెట్లు విడుదల చేయనున్న అధికారులు
* నేడు పల్నాడు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన.. పల్నాడు జిల్లా ఎడ్లపాడు లో స్పైసిస్ పార్కులో నెలకొల్పిన మిర్చి ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించనున్న సీఎం జగన్.. గుంటూరులో ఆజాద్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం
* గుంటూరు: నేటి నుండి రెండు రోజుల పాటు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలు.. పాల్గొననున్న 1200 మంది క్రీడాకారులు
* విశాఖ: నేడు స్టీల్ ప్లాంట్ కార్మికుల కుటుంబాల నిరసన.. 500 మంది మహిళలతో కూర్మన్న పాలెం దగ్గర ఆందోళనకు పోరాట కమిటీ నిర్ణయం.. శాంతియుత నిరసనలకు పరిమితం కావాలని ఇప్పటికే పోరాట కమిటీకి సూచించిన పోలీసులు.
* ప్రకాశం : మండ్లమూరు మండలం ఈదరలో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు, హాజరుకానున్న 13 ఉమ్మడి జిల్లాల బాలుర, బాలికల 27 జట్లు..