* నేడు తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల, ఫలితాలను విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
* హైదరాబాద్: నేడు ఉదయం 10 గంటలకు గోషామహల్‌లో బీజేపీ ర్యాలీ, ఆకాశ్‌పురి నుంచి ధూల్‌పేట్ వరకు బీజేపీ బైక్ ర్యాలీ, 2 వేలకు పైగా జాతీయ జెండాలు పంపిణీ చేయనున్న బీజేపీ నేతలు
* ఈ నెల 20న మునుగోడులో టీఆర్ఎస్ బహిరంగ సభ, నేడు బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించనున్న నల్గొండ నేతలు
* ప్రకాశం : నాగులుప్పలపాడు మండలం చౌటపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు.
* బాపట్ల : చీరాల పాపరాజుతోట షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా 108 మంది మహిళలచే బోనాల ఊరేగింపు కార్యక్రమం..
* ప్రకాశం: మార్కాపురంలో ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ..
* ప్రకాశం : మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శుక్రవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి మహిళలతో లక్ష సామూహిక కుంకుమార్చన కార్యక్రమం..
* ఒంగోలు 9వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి..
* నెల్లూరు: ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించనున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
* వెంకటాచలం మండలం దురువుల పాలెం లో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
* నెల్లూరు: కావలి రూరల్ మండలంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం
* నెల్లూరు: కొడవలూరు మండలం రామన్నపాలెం ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం
* నెల్లూరు: వెంకటగిరిలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, చిల్లకూరు మండలంలో గడప గడప కూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎం.ఎల్.ఏ.వరప్రసాద్
* నేడు రాజమండ్రిలో 5 కిలో మీటర్లు పొడవైన జాతీయ పతాకం ఆవిష్కరణ, అజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా రూపొందిన భారీ జాతీయ పతాకం, రాజమండ్రి హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న హోం మంత్రి తానేటి వనిత
* తిరుమల: ఇవాళ పౌర్ణమి సందర్భంగా గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
తూర్పుగోదావరి: నేడు ఎమ్మెల్సీ అనంతబాబు ను కోర్టు లో హాజరుపరచనున్న పోలీసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో విచారణ నేటికి వాయిదా వేసిన మెజిస్ట్రేట్, ఇప్పటికే ముగిసిన అనంత బాబు రిమాండ్
* తిరుపతి: బుచ్చి నాయుడు కండ్రిగ మండలం గాజుల పెళ్లురు సెగ్మెంట్ లో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే అదిములం
* కాకినాడ: ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నేడు కాకినాడలో టీడీపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలు తో బుల్లెట్ ర్యాలీ
* బాపట్ల జిల్లా: నేడు నగరం మండలం పెద్దవరంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ…
* కర్నూలు: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సప్తరథోత్సవాల్లో పురస్కరించుకుని నేడు పూర్వరాధన… స్వామి వారి మూలబృందావనంకు తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతభిషకం వంటి విషేశ పూజలు.. సింహవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న ఉత్సవమూర్తి ప్రహ్లదరాయులు.
* కర్నూలు: నేడు కోడుమూరులో శ్రీ అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా సర్వతోభద్ర చతుర్ముఖ మండప నిర్మాణానికి మహామత్స్య యంత్రస్ధాపన