What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • నేడు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలవనున్న తెలంగాణ మంత్రులు.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరనున్న టీఎస్‌ మంత్రుల బృందం
  • నేడు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామి ప్రమాణస్వీకారం.. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్న ధామి.. హాజరుకానున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
  • ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నేడు బీసీ సంఘాల ఆందోళన.. బీసీ గణన చేపట్టాలనే డిమాండ్‌తో నిరసన
  • నేడు ఉత్తరప్రదేశ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన.. రెండురోజుల పర్యటనలో బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీకానున్న షా
  • నేడు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్న ఏపీ బడ్జెట్ సమావేశాలు.. సభ ముందుకు రానున్న అధికార భాష చట్ట సవరణ బిల్లు
    ఏపీ శాసన మండలి
  • నేడు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఏపీ శాసన మండలి.. మండలి ముందుకు రానున్న నాలుగు బిల్లులు
  • నేడు దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ను ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌, క్షేత్ర స్థాయిలో నేరాలను అరికట్టడానికి, విజిబుల్ పోలీసింగ్‌ను మెరుగు పరచడానికి దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్, మహిళల భద్రతకు అందుబాటులోకి రానున్న 163 దిశ పెట్రోలింగ్‌ వాహనాలు
  • నేడు విశాఖ జిల్లా ఋషికొండలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయం ప్రారంభోత్సవం… ఉదయం 9.30 నుండి 11.30 గంట‌ల మ‌ధ్య వృష‌భ ల‌గ్నంలో మ‌హాసంప్రోక్షణ, పాల్గొననున్న టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, రేపటి నుంచి భక్తులకు సర్వ దర్శనానికి అనుమతి
  • అనంతపురం – కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి బ్రహ్మరథోత్సవం.
  • తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి రానున్న నాసా ఎయిర్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్‌కు నాయకత్వం వహించిన తొలి మహిళ జాహ్నవి.. రాజమండ్రివాసులచే జాహ్నవికి పౌరసన్మానం
  • తిరుమల: ఇవాళ జూన్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ.