What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* ఐపీఎల్‌: నేడు కోల్‌కతా వర్సెస్ లక్నో.. రాత్రి 7.30 గంటలకు కోల్‌కతా వేదికగా మ్యాచ్

* అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్‌ ప్రారంభం.. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్.. అసోంలో 126 స్థానాలకు 722 మంది పోటీ.. కేరళలో 140 స్థానాల్లో 883 అభ్యర్థులు పోటీ.. పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్.. బరిలో 294 మంది అభ్యర్థులు

* బాపట్ల: నేడు వేమూరులో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు పట్టాదారు పుస్తకాలు అందించనున్న సీఎం.. ఇప్పటి వరకు 22.79 లక్షల పట్టాదారు పుస్తకాలు రైతులకు అందజేత.. నేరుగా రైతులతో సమావేశంకానున్న సీఎం.. అనంతరం టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం

* జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాలకు కేటీఆర్.. జీవన్‌ రెడ్డి ఇంటికి వెళ్లనున్న కేటీఆర్, గంగుల కమలాకర్‌.. జీవన్‌ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించనున్న నేతలు

* అమరావతి : ఇవాళ తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్.. సాయంత్రం 4.10 గంటలకు తాడేపల్లి లోని తన నివాసం నుంచి బయలుదేరి 4.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. 5.20 గంటలకు విమానంలో బయలుదేరి 7.10 గంటలకు బెంగుళూరు చేరుకుంటారు.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 7.40 గంటలకు బెంగుళూరు లోని తన నివాసానికి చేరుకుంటారు జగన్..

* చిత్తూరులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన.. ఎన్సీ సావిత్రమ్మ ప్రభుత్వ మహిళ కళాశాల శతవార్షికోత్సవంలో పాల్గొననున్న వెంకయ్య నాయుడు..

* నేడు ఏలూరు జిల్లాలో రాష్ట్ర హోం మంత్రి అనిత పర్యటన.. ఏలూరులో నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్, పెదవేగిలో నూతనంగా నిర్మించిన పెదవేగి సర్కిల్ భవనం, పెదపాడు లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ లను ప్రారంభించనున్న హోం మంత్రి అనిత…

* తిరుమల: 5 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,017 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 26,863 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.17 కోట్లు

* అమరావతి: మధ్యాహ్నం 2 గంటలకు సోషల్‌ మీడియా నియంత్రణపై మంత్రి లోకేష్‌ ఆధ్వర్యంలో జీవోఎం సమావేశం.. ఏపీలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా బ్యాన్‌ చేయాలని ప్రభుత్వం కసరత్తు.. నేటి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం