Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* అమరావతి: ఇవాళ ఏపీ కేబినెట్‌ సమావేశం.. ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ భేటీ

* నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్.. కేబినెట్‌ సమావేశం అనంతరం ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.. రాత్రికి ఢిల్లీలోనే బస.. రేపు ఉదయం పార్లమెంట్‌లో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న మంత్రి నారా లోకేష్.. రేపు అర్ధరాత్రికి ఉండవల్లి నివాసంకు రానున్న మంత్రి నారా లోకేష్…

* హైదరాబాద్: నేడు కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పర్యటన వివరాలు.. ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం.. మధ్యాహ్నం 3 గంటలకు ఎయిమ్స్ బీబీనగర్ క్యాంపస్‌లో పర్యటించి పనుల పురోగతిపై సమీక్షించనున్న కిషన్‌రెడ్డి..

* మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్‌ జగన్.. రేపు అంబటి రాంబాబు, శుక్రవారం జోగి రమేష్‌‌ కుటుంబాలకు పరామర్శ..

* గుంటూరు: నేడు మాజీ మంత్రి అంబటి రాంబాబు కస్టడీ పిటిషన్ పై గుంటూరు కోర్టులో విచారణ. అంబటి రాంబాబును విచారణకోసం కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నల్లపాడు పోలీసులు.

* అనంతపురం : గుత్తి మండలం తొండపాడు బొలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా 9 వ రోజు స్వామివారికి ఆలయంలో స్వామివారి ఉత్సవమూర్తులకు వసంతోత్సవం, హంస వాహనంపై కొలువు తీర్చి ఆలయ ఆవరణలో ప్రాకారోత్సవం.

* కర్నూలు: నేడు కోడుమూరులో శ్రీ చౌడేశ్వరిదేవి తిరుగు రథోత్సవం

* నంద్యాల: నేడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించనున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఎమ్మెల్యే జయ సూర్య..

* నేడు రైల్వే కోడూరుకు జనసేన విచారణ కమిటీ .. ఇవాళ, రేపు రైల్వే కోడూరులో పర్యటించనున్న విచారణ కమిటీ..

* తిరుమల: 11 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,262 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,728 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు

* జోగి రమేష్‌, రాముల బెయిల్‌ రద్దు చేయాలని సిట్‌ పిటిషన్.. బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ ఎక్సైజ్‌ కోర్టులో సిట్‌ పిటిషన్

Exit mobile version