* ఇవాళ పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్.. జమ్ము కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, చండీగఢ్‌లో సివిల్ మాక్ డ్రిల్స్
* హైదరాబాద్: నేడు మిస్‌వరల్డ్ పోటీల గ్రాండ్ ఫైనల్.. హైటెక్స్‌లో భారీ ఏర్పాట్లు, రాత్రి 9.15 గంటలకు మిస్ వరల్డ్ విజేత ప్రకటన.. మిస్ వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్లు ప్రైజ్‌మనీ
* అంబేద్కర్ కోనసీమ: నేడు ముమ్మిడివరం మండలం చెయ్యేరులో సీఎం చంద్రబాబు పర్యటన.. ఫించన్లు పంపిణీ, బంగారు కుటుంబాల దత్తత, ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం
* కాకినాడ: నేటి నుంచి రెండు రోజులపాటు జిల్లాలో సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన.. నేడు పెద్దాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి.. రేపు రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం పిఠాపురంలో ప్రారంభించనున్న నాదెండ్ల మనోహర్
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో అహల్యా భాయి హోల్కర్ త్రిశత జయంతి ఉత్సవాలు.. ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సావో, అహల్యా భాయి త్రిశత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రేషన్ బియ్యాన్ని ఇంటింటికి పంపిణీ చేసే యం .డి .యు వాహనదారులు నిరసన ర్యాలీ.. కోటిపల్లి బస్టాండ్ సెంటర్ నుండి కోటగుమ్మం సెంటర్ వరకు ఎం.డి.యు. వాహనాలతో రాజమండ్రిలో భారీ ర్యాలీ
* అనంతపురం: కూడేరు మండలం గోటుకూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి పయ్యావుల కేశవ్
* నంద్యాల: నేడు మునిసిపల్ కౌన్సిల్ సర్వ సభ్య సమావేశం
* నేడు మంత్రి సత్యకుమార్ శ్రీశైలం పర్యటన.. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే అహిల్యా భాయి హెూల్కర్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న మంత్రి.. దేశంలోని పలు పుణ్యక్షేత్రాల పునరుద్ధరణకు సహకరించిన సందర్భంగా పుణ్య శ్లోక నిర్వహణ
* నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో 11 గంటలకు ములాఖత్ కానున్నవైస్సార్సీపీ PAC కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. అనంతరం కాకాణి కుటుంబ సభ్యులకు పరామర్శ
* నెల్లూరు: సిటీ నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి పొంగూరు నారాయణ
* నంద్యాల : నేడు శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో యోగ కార్యక్రమం.. ప్రధానాలయం ఎదురు గల గంగాధరమండపం వద్ద 1000 మందితో యోగా నిర్వహణ.. యోగ కార్యక్రమంలో పాల్గొననున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
* నెల్లూరు: సంగం మండలం తో పాటు ఆత్మకూరు మున్సిపాలిటీలలో పర్యటించి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
* విజయవాడ : ఇవాళ గన్నవరం నియోజకవర్గ వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశం.. సమావేశానికి హాజరుకానున్న జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని.. వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ..
* ప్రకాశం : మర్రిపూడి మండలం చిలంకూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ..
* నేడు ఖమ్మం, మహబూబాబాద్ కాంగ్రెస్ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. పాల్వంచ మండలం కిన్నెరసానిలో సమావేశం
* ఖమ్మం కాంగ్రెస్ ఆదివాసీ సమ్మేళనం ముగింపు సమావేశం లో మాట్లాడనున్న మీనాక్షి నటరాజన్..
* నేడు భద్రాద్రి జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన..
* మహబూబ్ నగర్ జిల్లా: జూరాలకు తగ్గిన వరద.. గేట్లు బంద్, దిగువకు నీటి విడుదల నిలిపేసిన అధికారులు.. ఇన్ ఫ్లో : 38,000 వేల క్యూ సెక్కులు.. ఔట్ ఫ్లో : 28,770 వేల, క్యూ సెక్కులు.. కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
* నేడు సంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ పర్యటన.. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించనున్న మంత్రి
* అమరావతి: నేడు పూర్తిస్థాయి రాష్ట్ర టీడీపీగా బాధ్యతలు స్వీకరించనున్న హరీష్ కుమార్ గుప్తా.. సాయంత్రం 4 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్న హరీష్ కుమార్
* విజయవాడ: నేడు రెండో రోజు లిక్కర్ కేసులో నిందితులను కస్టడీకి తీసుకోనున్న సిట్.. రాజ్ కేసి రెడ్డితో పాటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప లను విచారించనున్న సిట్.. ఇవాళ్టితో ముగియనున్న కస్టడీ
* నెల్లూరు: అక్రమ మైనింగ్ కేసులో మాజీమంత్రి కాకాణి తరపున 5వ అదనపు జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులు.. జూన్ 2కి వాయిదా వేసిన ప్రత్యేక ఎస్సీ ఎస్టీ జిల్లా కోర్టు.. ఇదే కేసులో కాకణిని పోలీసు కస్టడీకి కోరుతూ పిటిషన్, సోమవారం విచారణకు వచ్చే ఛాన్స్