* తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. శ్రీవారి ఆలయంలో తెరుచుకున్న ఉత్తర ద్వారం.. ఉత్తర ద్వార తలుపులను తెరిచి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు
* శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు.. శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు, మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని, చిరంజీవి సతీమణి సురేఖ, బాలకృష్ణ సతీమణి వసుంధర
* తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న హీరో నారా రోహిత్, మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. అప్పనపల్లికి పోటెత్తిన భక్తులు.. ఉత్తర ద్వార దర్శనం ద్వారా బాల బాలాజీ స్వామిని దర్శించుకుంటున్న భక్తులు.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పూలమాలలతో ఆలయానికి ప్రత్యేక అలంకరణ
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు .. ఉత్తర వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం.. ఉదయం 10:30 గంటలకు గరుడవాహనంపై గ్రామోత్సవం సేవ
* గుంటూరు జిల్లా: తెనాలి వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు స్వామి వారి ఉత్తర ద్వారం దర్శనం
* నెల్లూరు: వైష్ణవ ఆలయాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. తల్పగిరి రంగనాథుని ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చిన రంగనాథుడు.. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు
* విజయనగరం జిల్లా: నెల్లిమర్ల మండలం రామతీర్థంలో ముక్కోటి ఏకాదశి సందర్బంగా భక్తులకు ఉత్తరద్వార దర్శనం.. వేకువజామున 5 గంటల నుంచి భక్తులకు దర్శనం…
* శ్రీ సత్యసాయి : కదిరిలోని శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. శ్రీవారి దర్శనానికి తెల్లవారుజామునే బారులు తీరిన భక్తులు
* ఖమ్మం: నేడు మంత్రి పొంగులేటి పర్యటన… ఎదులపురం మున్సిపల్ కార్యకర్తల తో సమావేశం కానున్న మంత్రి పొంగులేటి
* యాదాద్రి: వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.. హాజరైన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సెక్రెటరీ రామకృష్ణారావు
* ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత.. గడిచిన 24 గంటల్లో సంగారెడ్డి జిల్లా కోహిర్ 6.3, పటాన్ చెరులో 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.. మెదక్ జిల్లా దామరంచ 8.4, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట్ 9.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత.. ఉమ్మడి మెదక్ జిల్లాలో 16 చోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్
* నిజామాబాద్: ముక్కోటి ఏకాదశి సందర్భంగా.. వైష్ణవాలయాల్లో భక్తుల రద్దీ.. ఉత్తర ద్వారా దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు. ఉత్తర తిరుమల క్షేత్రం, జెండా బాలాజీ ఆలయం, కోదండ రామాలయం, నర్సింగ్ పల్లి ఇందూరు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ.
* కామారెడ్డి : బాన్సువాడ లో ముక్కోటి ఏకాదశి పర్వదినం ప్రత్యేక పూజలు .. వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనానికి బారులు తీరిన భక్తులు.. స్వామివారి పల్లకి సేవ ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు .. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ
* జగిత్యాల జిల్లా: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉదయం 3గంటలకు లక్ష్మీ సమేత యోగ, ఉగ్రనరసింహ,వెంకటేశ్వర స్వామి స్వాముల మూల విరాట్ లకు మహా క్షీరాభిషేకాలు, అభిషేకాలు.. అభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
* జగిత్యాల జిల్లా: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం లో జరుగుతున్న ముక్కోటి ఏకాదశి వేడుకలు హాజరైన జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు
* జగిత్యాల జిల్లా: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ప్రత్యేక పూజల అనంతరం వైకుంఠ ద్వారాలు తెరిచిన ఆలయ అర్చకులు.. వైకుంఠ ద్వారం గుండా స్వామి వార్లను దర్శించుకుంటున్న వేలాదిమంది భక్తులు
* జగిత్యాల జిల్లా : వైకుంఠ ఏకాదశి సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. వైకుంఠం ద్వారం గుండా దర్శనానికి క్యూలైన్ లో బారులు తీరిన భక్తులు
* రాజన్న సిరిసిల్ల జిల్లా: ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం గావించిన ఆలయ అర్చకులు.. ఆలయ అభివృద్ధిలో భాగంగా స్వామివారికి ఏకాంతంగా పూజలు నిర్వహిస్తున్న ఆలయ అర్చన
* రాజన్న సిరిసిల్ల జిల్లా: ముక్కోటి ఏకాదశి సందర్భంగా హరిహర క్షేత్రమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు.. స్వామివారి భక్తోత్సవం, శ్రీ స్వామివారికి ప్రాతఃకాల పూజ, పల్లకి సేవ పై ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వైకుంఠ ద్వార దర్శనం
* కరీంనగర్ జిల్లా: ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా దర్శనం. ప్రత్యేక పూజలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు.
* ఆదిలాబాద్: నేడు నాగోబా నుంచి పవిత్ర గంగాజల సేకరణ పాదయాత్ర.. ప్రత్యేక పూజల తర్వాత పాద యాత్ర గా బయలు దేరనున్న మెస్రం వంశీయులు. ఇప్పటికే కేస్లాపూర్ కు చేరుకున్న ప్రచార రథం.
* కొమురం భీం: నేడు జంగు బాయి వద్ద మహా పూజ. గుహలో దీపం వద్ద ప్రత్యేక పూజలు చేయనున్న ఆదివాసీలు
* ఆదిలాబాద్: ముక్కోటి ఏకాదశి పర్వ దినం సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ.. ఉదయం నుంచి ఉత్తర ద్వార దర్శనాలు. భక్తులతో కిరికిటలాడుతున్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర ఆలయం, మంగ మఠం శ్రీ రామా సత్యనారాయణ స్వామి ఆలయం, శ్రీరామ చంద్ర గోపాల కృష్ణా మఠం.
* మహబూబాబాద్ జిల్లా: వైకుంఠ ఏకాదశి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా లో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. డోర్నకల్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయం లో తెల్లవారు జాము నుండి స్వామి వారికి పూజలు ..
* కర్నూలు: నేడు మద్దికేర (మం) పెరవలి శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవం. శ్రీదేవి భూదేవి కళ్యాణోత్సవం. ఉత్తర ద్వారం నుండి భక్తుల దైవదర్శనం.
* నంద్యాల: నేడు శ్రీశైలం మల్లన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవం.. ఉత్తరద్వారం వద్ద శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు.. రావణవాహనసేవపై శ్రీస్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం
* నంద్యాల: నేడు చెంచు గిరిజనులకు శ్రీశైలం మల్లికార్జునస్వామి వారి ఉచితం స్పర్శ దర్శనం.. ప్రతి నెలలో ఒకరోజు చెంచు గిరిజనులకు ఉచితంగా స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించిన బోర్డ్ చైర్మన్ రమేష్ నాయుడు, సభ్యులు.. నేడు ఉదయం 11 గంటలకు డోనేషన్ కౌంటర్ క్యూలైన్ ద్వారా ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతి.. స్పర్శ దర్శనానికి శ్రీశైలం పరిధిలోని చెంచు గిరిజనులను ఐటీడీఏ అధికారి సహకారంతో ఎంపిక
* నంద్యాల: మహానంది క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా సీతారాముల దర్శనం , పుష్పయాగం.. సంజీవనగర్ రామాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేడు విశేషాలంకరణలో దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి
* నంద్యాల: ఆత్మకూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయములో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం దర్శనం
* నంద్యాల: బనగానపల్లె కొండపేట కొట్నాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో అత్యంత వైభవంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు. స్వామి అమ్మ వార్లను ఉత్తర ద్వార దర్శనం చేసుకు నేందుకు తెల్లవారు ఝాము నుండి ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు.