Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* ఢిల్లీ: నేడు 18వ రోజ్గార్‌ మేళా.. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రోజ్గార్‌ మేళాలో పాల్గొననున్న ప్రధాని మోడీ.. 61 వేల మందికి నియామకపత్రాలు అందజేయనున్న మోడీ.. దేశవ్యాప్తంగా 45 చోట్ల రోజ్గార్‌ మేళా

* తిరుపతి: నేడు నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన.. స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం ..

* హైదరాబాద్‌: నేడు చంద్రాయణగుట్టకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.. రోజ్గార్‌ మేళాలో పాల్గొననున్న కిషన్‌ రెడ్డి

* విశాఖ: నేడు ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ టూర్.. CISF ఆధ్వర్యంలో జరుగుతున్న రోజ్ గార్ మేళాలో నియామక పత్రాలు అందించనున్న మంత్రి

* విజయవాడకు కేంద్రమంత్రి అర్జున్ రాం మేఘావాల్.. ఏకాత్మ మానవ దర్శన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న కేంద్రమంత్రి అర్జున్ రాం మేఘావాల్

* తిరుమల: ఇవాళ ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ నెల దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమల వసతి గదులు కోటా విడుదల

* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనం , ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనం , ఉదయం 11 గంటలకు గరుడ వాహనం , మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనం , మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం , సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనం.. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు.. ఇవాళ సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు

* నేడు బాపట్లలో నో డ్రగ్స్ ర్యాలీ, పాల్గొనున్న ఈగల్ చీఫ్ రవికృష్ణ, ఎమ్మెల్యే నరేంద్రవర్మ, అధికారులు.

* పల్నాడు జిల్లా: నేడు మాచవరం మండలం పిన్నెల్లిలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పర్యటన. దాడిలో మృతి చెందిన సాల్మన్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న మంద కృష్ణ

* కర్నూలు: నేడు కోడుమూరులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

* కర్నూలు: ఎమ్మిగనూరు లో బంద్ ను అడ్డుకున్న పోలీసులు. ఆదోని జిల్లా ప్రకటించాలని ఇవాళ బంద్ కు పిలుపిచ్చిన ఆందోళనకారులు.. బస్ డిపో ముందు ధర్నా చేస్తున్న ఆదోని జిల్లా సాధన సమితి నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు.

* కర్నూలు: నేడు మంత్రాలయంలో అదోని జిల్లా సాధన కోసం వైసిపి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అధ్వర్యంలో ర్యాలీ, ధర్నా… నాలుగు మండలాల నుంచి భారీగా తరలిరానున్న వైసిపి శ్రేణులు, నాయకులు.

* గుంటూరు: నేడు చేబ్రోలు మండలం వడ్లమూడి డీవీసీ హాస్పిటల్ లో ఎమ్మారై సెంటర్ ప్రారంభించనున్న మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.

* నేటి నుంచి విశాఖ ఉత్సవ్ 2026.. ఆర్కే బీచ్‌లో ఉత్సవాలను ప్రారంభించనున్న మంత్రి డోలా.. విశాఖ – అనకాపల్లి -అరకులో ఒకేసారి టూరిజం ఫెస్ట్.. సీ టూ స్కై థీమ్ తో జరుగుతున్న ఉత్సవాల కోసం భారీ ఏర్పాట్లు…. భారతదేశపు సమీకృత గ్లోబల్ కోస్టల్–హిల్ గ్రోత్ కారిడార్‌గా ప్రమోట్ చేయడం లక్ష్యం

* అనంతపురం : గార్లదిన్నె మండల పరిధిలోని కోటంక గ్రామంలో నేటి నుంచి గుంటి సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలు ప్రారంభం.

* అనంతపురం : ఈ నెల 25న అనంతపురం జిల్లా తెలుగుదేశం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం.. హాజరుకానున్న మంత్రి పయ్యావుల కేశవ్.

Exit mobile version