* ఆసియా కప్: నేడు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్.. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్
* ఢిల్లీ: ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ.. ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం
* నేడు పాట్నాలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరుకానున్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ.. పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్.. ఏపీ నుంచి హాజరుకానున్న షర్మిల, రఘువీరారెడ్డి, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు
* తిరుమల: ఇవాళ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. మధ్యాహ్నం మాడవీధులో ఉరేగునున్న గరుడ పఠం, పరివార దేవతలు.. సాయంత్రం 5:45 నిముషాలకు ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలు.. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* ఇవాళ, రేపు సీఎ చంద్రబాబు తిరుమల పర్యటన.. సాయంత్రం 6:20 గంటలకు తిరుమల చేరుకోనున్న సీఎం.. రాత్రి 7:40 గంటలకు బేడి ఆంజనేయస్వామి ఆలయంకు చేరుకొని 7:55కి ఊరేగింపుగా బయల్దేరి వెళ్లి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు.. 9 గంటలకు పెద్దశేష వాహన సేవలో పాల్గొననున్న సీఎం..
* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నేడు మూడో రోజు.. నేడు అమ్మవారు అన్నపూర్ణా దేవి అవతారంలో భక్తులకు దర్శనం..
* నేడు, రేపు ఏపీలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన.. సాయంత్రం 4.30కి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.. రాత్రి 8:30 గంటలకు తిరుమల చేరుకోనున్న ఉపరాష్ట్రపతి.. మహాద్వారం నుంచి వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి.. సీఎం చంద్రబాబుతో కలసి పెద్దశేష వాహన సేవలో పాల్గొననున్న సీపీ రాధాకృష్ణన్.. రేపు ఉదయం ఆలయ మర్యాదలతో శ్రీవారిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి
* తిరుమల: ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో 15వ సారి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
* అమరావతి: ఇవాళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం.. హాజరుకానున్న వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు..
* అమరావతి: ఇవాళ ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్ తో సమావేశాలు ప్రారంభం.. అమరావతి అభివృద్ధి పనులు.. ఉద్యోగుల పీఆర్సీ, చిత్తూరు జిల్లాలో విశ్వవిద్యాలయం, నూతన బాలిక సంరక్షణ చట్టం, జీవీఎంసీ ప్రధాన రహదారి మురుగునీటిపారుదల వ్యవస్థ విస్తరణ.. చంపావతి నీటి వినియోగం.. స్కూల్ విద్యార్థులకు యూనిఫాంపై సభ్యుల ప్రశ్నలు. గ్రామ వార్డ్ సచివాలయ సవరణ బిల్లు.. ఆక్వా కల్చర్ డవలప్మెంట్ ఆధార్టీ. సవరణ బిల్లు సభలో ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం..
* అమరావతి: ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఐదవ రోజు శాసనమండలి సమావేశాలు…
* హైదరాబాద్: నేడు ఉదయం 11 గంటలకు ఎంబీ భవన్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మీడియా సమావేశం.. రీజినల్ రింగ్ రోడ్డు సమస్యపై ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించిన సీపీఎం బృందం.. నేడు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటన
* విజయవాడ: ఇవాళ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ సమావేశం.. విజయవాడలో ఒక ప్రముఖ హోటల్ లో సమావేశం కానున్న స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్.. ఇన్సూరెన్స్ విధానానికి మారడం, NTR వైద్యసేవా ట్రస్టు నుంచీ భారీ బకాయిలు, భవిష్యత్ కార్యాచరణ పై చర్చ
* వరంగల్: శ్రీ భద్రకాళీదేవీ శరన్నవరాత్రి (దసరా) మహోత్సవాలలో భాగంగా నేడు 3వ రోజు ఉదయం 4 గంటలకు ” నిత్యాహ్నికం,
గాయత్రి అలంకారము, చతు:స్థానార్చన. చంద్ర ఘంటా దుర్ఘర్చన. ఉదయం 11 గంటలకు సింహ వాహన సేవ.. సాయంత్రం 7 గంటలకు మహిష మర్ధిని దుర్గార్చనా, గజవాహన సేవ లో భక్తులకు దర్శనం ఇవ్వనున్న భద్రకాళి అమ్మవారు..
* నేడు గజ్వేల్ నియోజకవర్గంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటన.. వర్గల్ సరస్వతి అమ్మవారిని దర్శించుకొనున్న కవిత
* ఖమ్మం: నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
* భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానం నందు జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు అయిన నేడు సంతాన లక్ష్మి అకారం లో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు
* కాకినాడ: రెండో రోజు ఉప్పాడ లో ఆందోళనలు కొనసాగించనున్న మత్స్యకారులు.. రోడ్డు మీద వంటా వార్పు చేసి, సామూహిక భోజనాలు చేసేలా కార్యక్రమం.. ఫార్మా కంపెనీల నుంచి తమకు నష్టపరిహారం ఇప్పించాలని నిన్న నిరసన తెలియజేసిన మత్స్యకారులు
* రాజమండ్రి దేవి చౌక్ లో మూడవ రోజు ఘనంగా దసరా వేడుకలు .. అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న బాలత్రిపుర సుందరీ దేవి అమ్మవారు.. అన్నపూర్ణదేవికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్న భక్తులు.. 108 దంపతులతో కుంకుమ పూజలు
* పశ్చిమ గోదావరి: నేడు పాలకొల్లు రానున్న సీఎం చంద్రబాబు.. మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహానికి హాజరు కానున్న సీఎం ..
* నెల్లూరు: ఇవాళ మూడో రోజూ లేడీ డాన్ అరుణను విచారించనున్న కోవూరు పోలీసులు.. తొలిరోజు గిరిజనులను మోసం చేసిన కేసులో అరుణను విచారించిన పోలీసులు.. ఇవాళ మధ్యాహ్నం దాకా సమయం ఉండటంతో మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్న కోవూరు పోలీసులు..
* శ్రీ సత్యసాయి : లేపాక్షిలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయంలో నేడు 3వ రోజు శ్రీ అన్నపూర్ణేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీ దుర్గా దేవి.
* అనంతపురం : తాడిపత్రి లో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు భక్తులకు ప్రత్యేక అలంకారం తో దర్శనమివ్వనున్న దుర్గా దేవి అమ్మవారు.
* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,837 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 20,904 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.2.85 కోట్లు
* అమరావతి: అసెంబ్లీలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు లో వైఎస్ జగన్ మరో పిటిషన్.. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 5న స్పీకర్ రూలింగ్ చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలని పిటిషన్ లో కోరిన జగన్.. నేడు విచారణ
* కర్నూలు: నేడు గూడూరు (మం) కె.నాగులాపురం శ్రీ సుంకులాపరమేశ్వరి దేవి ఆలయంలో అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న సుంకులాపరమేశ్వరి
* నంద్యాల: మహానంది క్షేత్రంలో కామేశ్వరీ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు…. నేడు కామేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవ మూర్తికి చంద్రఘటిక అలంకరణ , కామేశ్వరీ దేవి అమ్మవారి మూలమూర్తికి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకరణ
* నంద్యాల: బనగానపల్లె (మం) నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ క్షేత్రం లో దేవి శరన్నవ రాత్రి వేడుకల్లో నేడు చంద్రఘంట అలంకారం లో భక్తులకు దర్శనం ఇవ్వ నున్న అమ్మవారు.
* జోగులాంబ గద్వాల జిల్లా: అలంపూర్ లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా…మూడవ రోజు చంద్రఘంటా దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న జోగులాంబ అమ్మవారు..