* ఇవాళ వాషింగ్టన్‌లో లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కీలక దౌత్య చర్చలు.. హాజరుకానున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కోరుబియో.. పాల్గొననున్న ఇజ్రాయెల్ రాయబారి యెహియేల్ లైటర్, లెబనాన్ రాయబారి మోవాద్.. ఈ రోజు రాత్రి 10 గంటలకు లెబనాన్ – ఇజ్రాయెల్ కీలక సమావేశం
* నేడు దేశీయ స్టాక్‌మార్కెట్లకు సెలవు.. అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు.. సాయంత్రం 5 నుంచి పనిచేయనున్న కమోడిటీ మార్కెట్లు
* ఐపీఎల్: నేడు చెన్నై వర్సెస్ కోల్‌కతా మ్యాచ్.. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* అమరావతి: సాంకేతిక చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం.. క్వాంటం కంప్యూటింగ్ పరిశోధనలను వేదికకానున్న అమరావతి.. దేశంలోనే మొట్టమొదటి క్వాంటం హార్డ్‌వేర్ టెస్ట్ బెడ్లను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
* కాకినాడ: ఇవాళ అర్ధరాత్రి నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం.. సంతానోత్పత్తికి ఇబ్బందులు లేకుండా ప్రతి ఏడాది చేపల వేట నిషేధం.. వేట నిషేధం ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా, బోటు స్వాధీనం, రిజిస్ట్రేషన్ రద్దు.. మత్స్యకార భరోసా కింద రూ.20 వేలు అందించనున్న ప్రభుత్వం
* తెలంగాణలో నేడు, రేపు ఎండల తీవ్రత పెరిగే అవకాశం.. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక ప్రభావం
* ఖమ్మం: నేడు కాంగ్రెస్ కార్యవర్గ పదవీ బాధ్యతల స్వీకరణ హాజరుకానున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
* నిర్మల్: నేడు జిల్లా లో డీజీపీ శివధర్ రెడ్డి పర్యటన. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న డీజీపీ
* నేడు సిద్దిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న హరీష్ రావు
* అమరావతి : తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమం.. హాజరుకానున్న పార్టీ ముఖ్యనేతలు..
* అనకాపల్లి: నేడు జిల్లాలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన. నాతవరంలో డాక్టర్ BR అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న మంత్రి అనిత. నాతవరం,గొలుగొండ,KD పేట నూతన పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించనున్న హోం మంత్రి.
* కర్నూలు: నేడు గూడూరు శ్రీ తిమ్మగురుడు స్వామి తిరునాళ్ల మహోత్సవాలలో గరుడోత్సవం , పల్లకిసేవ
* శ్రీ సత్యసాయి : నేడు మంత్రి సత్యకుమార్ పర్యటన వివరాలు. ఉదయం 9:00 గంటలకు అంబేద్కర్ జయంతి సందర్భంగా ధర్మవరం పట్టణం, కళాజ్యోతి సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఉదయం 10:00 గంటలకు ధర్మవరం మార్కెట్ యార్డ్ నందు పదవ తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 నిమిషాలకు బత్తలపల్లి మండల కేంద్రంలో ఎస్సీ లబ్ధిదారులకు సోలార్ ప్యానెళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు సోలార్ ప్యానెల్లు అందిస్తారు. మధ్యాహ్నం 3:00 గంటలకు ధర్మవరం పోతుకుంట ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని సందర్శిస్తారు..
* అనంతపురం : ఉరవకొండలో జరుగునున్న అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
* తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్ లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,724 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 31,786 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.4.59 కోట్లు
