What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • నేడు కడపలో బీజేపీ బహిరంగసభ, రాయలసీమ రణభేరి పేరుతో బీజేపీ సభ, హాజరుకానున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పురంధేశ్వరి, ఇతర రాష్ట్ర నేతలు.
  • నేడు మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు కీలక మ్యాచ్‌, ఆక్లాండ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత మహిళల జట్టు.
  • పంజాబ్‌లో ఇవాళ కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారం.. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో కేబినెట్‌ ప్రమాణస్వీకారం.
  • ఏపీ వ్యాప్తంగా నేడు, రేపు నిరసనలకు టీడీపీ పిలుపు, నాటుసారా నిషేధించాలంటూ టీడీపీ ఆందోళన.
  • ఒంగోలు ఇవాళ్టి నుండి 29వ తేదీ వరకూ నాలుగు బ్యాచ్‌లుగా ఎంపీటీసీలకు విధులు – భాద్యతలపై శిక్షణా తరగతులు.
  • అనంతపురం జిల్లా కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాల చంద్రప్రభ, సూర్యప్రభ వాహన సేవ.
  • తూర్పుగోదావరి జిల్లా నేడు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌ కౌన్సిల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశం. ఉదయం 11 గంటలకు కౌన్సిల్, మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్‌.
  • నెల్లూరులోని పెన్నా నదిపై నిర్మిస్తున్న బ్యారేజ్ పనులను ఈ రోజు పరిశీలించనున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
  • విశాఖ: ఋషికొండలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయంలో రెండో రోజు మ‌హాసంప్రోక్ష‌ణ కార్యక్రమాలు. నేడు శ్రీవారి ఆలయం సందర్శించనున్న మంత్రి అవంతి శ్రీనివాస్.
  • విజయనగరం: నేడు రామతీర్ధం రాస్వామి ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమం.
  • అనంతపురం: హిందూపురంలో నేడు శ్రీ పేట వెంకటరమణ స్వామి దేవాలయంలో స్వామివారి ప్రాకార ఉత్సవం.
  • అనంతపురం : చెన్నేకొత్తపల్లి మండలంలోని న్యామద్దల గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి జాతర.
  • నేడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
  • నేటి నుంచి మూడు రోజులపాటు గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల నిదానంపాటి అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాలు.
  • జగిత్యాల జిల్లా: నేడు సాయంత్రం ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్ల తెప్పోత్సవం. డోలోత్సవం.