NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* గుంటూరు: నేడు రెండో రోజు వైసీపీ ప్లీనరీ సమావేశాలు.. వైసీపీ అధ్యక్షుడిగా మరోసారి వైఎస్‌ జగన్‌ను ఎన్నుకోనున్న ప్రతినిధులు, అధ్యక్ష నేటితో ముగియనున్న ప్లీనరీ

* నేడు బర్మింగ్‌హామ్‌ వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య సెకండీ టీ-20 మ్యాచ్‌

* నేడు కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం-వాతావరణశాఖ

* హైదరాబాద్‌లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం.. రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ, హైదరాబాద్‌తో పాటు 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఈ సీజన్‌లో తొలిసారి రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

* తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలకు అవకాశం-వాతావరణశాఖ

* తిరుమల: ఎల్లుండి టీటీడీ పాలకమండలి సమావేశం, 12వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న సర్వదర్శనం, ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేసిన టీటీడీచ 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం

* అనంతపురం : ఉరవకొండలో అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడిన వాహనాలను నేడు బహిరంగ వేలం వేయనున్న అధికారులు.

* కాకినాడ జిల్లా : నేడు కాకినాడ రానున్న శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి, కంచి కామకోటి పీఠం 70 వ పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చాతుర్మాస్య దీక్ష ఆచరించుటకు కాకినాడ సమీపంలో తిమ్మాపురం వద్ద గోశాలకు రాక, స్వాగత ఏర్పాట్లు చేసిన చాగంటి కోటేశ్వరరావు.

* కోనసీమ: నేడు మండపేటలో జనసేన ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం, ఈ నెల 16న జిల్లాలో పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర ఏర్పాట్లు పై చర్చించనున్న నేతలు

* విశాఖ: నేడు విశాఖ నుంచి ప్రారంభంకానున్న ప్రజాశాంతి పార్టీ ఆంధ్ర యాత్ర.. పాల్గొనున్న ఏకే పాల్.

* వరంగల్: శ్రీ భద్రకాళి దేవాలయంలో 10వ రోజు కొనసాగుతున్న శాకంబరీ మహోత్సవాలు.. నేడు ఉదయం నీలా క్రమం, సాయంత్రం నిత్యానిత్యా క్రమంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీ భద్రకాళి అమ్మవారు.

* నేడు ఓరుగల్లు నగరంలో జగన్నాథుడి రథయాత్ర, మధ్యాహ్నం ఒంటి గంటకు కేయూ క్రాస్‌ రోడ్డు నుంచి ప్రారంభమై నయీంనగర్‌, పెట్రోల్‌ పంప్‌, హనుమకొం డ చౌరస్తా, ములుగురోడ్‌, ఎంజీఎం సెంటర్‌, పోచమ్మ మైదాన్‌ మీదుగా ములుగు రోడ్‌ వెంకటేశ్వర్వ గార్డెన్‌ వరకు వైభవంగా జరగనున్న రథయాత్ర.