* ఐపీఎల్‌లో నేడు ఢిల్లీతో బెంగళూరు ఢీ.. సాయంత్రం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. రాత్రి 7.30 గంటలకు లక్నో-పంజాబ్‌మధ్య మ్యాచ్
* నేడు వరంగల్‌లో బీజేపీ ‘‘నిరుద్యోగ మార్చ్’’.. వేలాది మంది నిరుద్యోగులతో ర్యాలీకి సిద్ధమైన బీజేపీ. హన్మకొండ కేయూ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న బండి సంజయ్.. టీఎస్పీఎస్ అవకతవకలపై సర్కార్ కు నిలదీయనున్న నేతలు
ప్రకాశం : మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహనంపై సార్వభౌమ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న స్వామి వారు.. సాయంత్రం 6 గంటలకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం..
* 71వ రోజుకు చేరిన టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర.. పొలిమేరమెట్ట, యర్రగుంటపల్లి, కలచర్ల, ఎస్.రంగాపురం తర్వాత పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం… శభాష్ పురం, పెద్దకొండ, గుడిసె గుప్పరాల, డీసీ కొండ క్రాస్ మీదుగా రాంపల్లి వరకు సాగనున్న పాదయాత్ర.
* కాకినాడ: మంత్రి రాజా తుని లో పలు కార్యక్రమాలు లో పాల్గొంటారు
* కర్నూలు: మంత్రాలయంలో పాత ఊరిలో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు స్వామి వారికి తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతాభిషేకం వంటి విషేశ పూజలు.. సాయంత్రం స్వామివారిని రథంపై ప్రాకారం చుట్టూ ఉరేగింపు.
* నేడు విశాఖ ఉక్కు కార్మిక, నిర్వాసిత కుటుంబాల పాదయాత్ర.. సింహాచలం దేవస్థానం వరకు సుమారు 30 కిలోమీటర్లు నడక.. కూర్మన్నపాలెం, పెడగంట్యాడ జంక్షన్ నుంచి వేరు వేరుగా ప్రారంభమై గాజువాకలో కలవనున్న పాదయాత్ర.. పాల్గొననున్న మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ
* విశాఖ: నేడు శ్రీ హనుమాన్ విజయోత్సవ బైక్ ర్యాలీ, శోభా యాత్ర.. వేలాదిమందితో ఎన్ ఏ డి నుంచి బీచ్ రోడ్ వరకూ బైక్, కారు ర్యాలీ.. పార్క్ హోటల్ జంక్షన్ నుంచి కాళీ మాత ఆలయం వరకు శోభా యాత్ర.. కరస నుంచి ప్రారంభమై ఊర్వశీ జంక్షన్, ద్వారకా నగర్, గురుద్వారా, సీతమ్మ ధార, ఇసుక తోట, ఎం.వీ.పీ. డబుల్ రోడ్, ఉషోదయ మీదుగా బీచ్ రోడ్ కు చేరనున్న బైక్ ర్యాలీ.. శోభాయాత్ర సమయంలో ఇతర వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించాలని పోలీసులు విజ్ఞప్తి
* విశాఖ: రైల్వే గ్రౌండ్స్ వేదికగా విశాఖ ట్రోఫీ ఫుట్ బాల్ మ్యాచ్ లు.. మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఫుట్ బాల్ పోటీలు.. నాలుగు పూల్స్ లో తలబడనున్న 16టీమ్ లు
* అనంతపురం : కుందుర్పి మండల కేంద్రంలో నేడు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్
* గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలని, ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని, రైతు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా..
* పల్నాడు : నేడు చిలకలూరిపేట 37వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర మంత్రి విడదల రజిని.
* నేడు మంగళగిరి విటిజేయం కాలేజీలో బహుజన న్యాయవాదుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సభ…
* పల్నాడు : శావల్యాపురం మండలం పోట్లూరులో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరునాళ్లు…
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైసిపి జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తారు అనంతరం మనుబోలు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు
* నెల్లూరు నగరంలోని శ్రీ త్యాగరాజ కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం
* నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. సీనియర్ నేతల సమావేశం
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాష్ట్ర హోం మంత్రి వర్యులు తానేటి వనిత అధ్వర్యంలో కొవ్వూరు టౌన్ 8 వ వార్డ్ నందు జరుగు గడప గడపకు మన ప్రభుత్వ(95వ రోజు) కార్యక్రమం జరుగును.. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకు 8వ వార్డ్ రామాలయం వద్ద నుండి ప్రారంభం అవుతుంది
* తూర్పుగోదావరి జిల్లా : రేపు ఒకరోజు రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జి పై వాహనాల రాకపోకలు నిలుపుదల.. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6గంతల వరకు. వాహనాలు రాకపోకలు నిలుపుదల.. రోడ్డు కం రైలు బ్రిడ్జిపై మరమ్మత్తు పనులు చేపడుతున్న ఆర్. అండ్ బి అధికారులు
* పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..
* పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ..
* తిరుమల: ఇవాళ టిటిడి పాలకమండలి సమావేశం