Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story West Bengal To Give Mutton Biryani Chicken Curry To Prisoners For Durga Puja

Prisoners: ఖైదీలకు దసరా గుడ్‌న్యూస్.. 4 రోజులు లంచ్.. డిన్నర్‌లో మటన్, చికెన్ బిర్యానీలు

Published Date :October 5, 2024 , 3:37 pm
By Suresh Maddala
  • ఖైదీలకు దసరా గుడ్‌న్యూస్
  • 4 రోజులు లంచ్.. డిన్నర్‌లో మటన్.. చికెన్ బిర్యానీలు
Prisoners: ఖైదీలకు దసరా గుడ్‌న్యూస్.. 4 రోజులు లంచ్.. డిన్నర్‌లో మటన్, చికెన్ బిర్యానీలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

క్షణికావేశంలో చేసిన తప్పులు కారణంగా వారంతా జైల్లో మగ్గుతున్నారు. రక్త సంబంధాలకు దూరంగా నాలుగు గోడల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. వారికి ఓ పండుగ ఉండదు. ఓ ఆనందం ఉండదు. అక్కడే తింటూ.. ఆ నలుగురితోనే ఉంటూ ధీనమైన బతుకును జీవిస్తుంటారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఒక ఆందోళనకరమైన జీవితాన్ని జీవిస్తున్న ఖైదీల కోసం పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. ఖైదీల్లో సరికొత్త మార్పు తీసుకొచ్చేందుకు దసరా పండుగ సందర్భంగా దుర్గాపూజ జరిగే సమయంలో సరికొత్త మెనూ అందించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

దుర్గాపూజ వేడుకల సమయంలో ఖైదీలకు రుచికరమైన భోజనాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లంచ్, డిన్నర్ సమయంలో మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, బసంతి పులావ్, మాచెర్ మాతా దియే పుయ్ షాక్ (చేప తలతో కూడిన మలబార్ బచ్చలికూర) మరియు మాచెర్ మాతా దియే దాల్ (చేప తలతో పప్పు) తో వడ్డించనున్నారు. ఖైదీలు పండుగ సంతోషాన్ని కోల్పోతున్నామన్న బాధ కలుగకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త మెనూ అక్టోబర్ 9 నుంచి 12 వరకు అందించనున్నారు. ఈ ఆహార పదార్థాలన్నీ ఖైదీల చేతనే తయారు చేయించనున్నారు. ఖైదీల్లో మార్పు తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం అధికారి వెల్లడించారు.

ఈ కొత్త మెనూ ఖైదీలతో పాటు రిమాండ్ ఖైదీలకు కూడా అందించనున్నారు. లంచ్, డిన్నర్ సమయంలో షష్టి నుంచి దశమి వరకు అమల్లో ఉంటుందని అధికారి తెలిపారు. దుర్గాపూజ ప్రారంభం నుంచి ముగింపు వరకు చక్కని ఆహారాన్ని అందిస్తామని వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఖైదీలకు దసరా పండుగ సందర్భంగా మంచి ఆహారం అందిస్తామని.. ఈసారి ఖైదీల కోరిక మేరకు ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేవలం వారి ముఖాల్లో చిరునవ్వు తెచ్చేందుకే ఈ ప్రయత్నమని చెప్పుకొచ్చారు. ఇలాంటి కార్యక్రమాలతో ఖైదీల వ్యక్తిగత జీవితాల్లో మంచి మార్పు వస్తుందని భావిస్తున్నట్లు అధికారి తెలిపారు. ఈ రుచికరమైన వంటకాలన్నీ ఖైదీలే తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు.

వైరటీలు ఇవే..
మాచర్ మాతా దియే పుయ్ షక్, మాచెర్ మాతా దియే దాల్, లూచీ-చోలార్ దాల్, పాయేష్, చికెన్ కర్రీ, ఆలు. పొటోల్ చింగ్రీ, మటన్ బిర్యానీ విత్ రైతా మరియు బసంతి పులావ్ ఉండనున్నాయి. మొత్తానికి బెంగాల్‌లో ఫేమస్ అయిన వంటకాలన్నీ ఖైదీలు రుచి చూడనున్నారు. ఇదిలా ఉంటే ఖైదీలకు బలవంతంగా ఆహారాన్ని అందించబోమన్నారు. ఎవరి మతాచారాల ప్రకారం నచ్చిన ఆహారాన్ని మాత్రమే అందిస్తామని అధికారి తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chicken curry
  • Durga Puja
  • mutton biryani
  • Prisoners
  • West Bengal government

తాజావార్తలు

  • Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

  • TTD Laddu Sales Record: లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డు..

  • Babar Azam: “విరాట్‌ కోహ్లీతో నాకు పోలిక ఏంటి?”.. జర్నలిస్టుకు బాబర్ ఆజాం స్ట్రాంగ్ కౌంటర్

  • Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మరో హండ్రెడ్ క్రోర్ పడుతుందా..?

  • CarPlay: భారత్ లో వాట్సాప్ ఫర్ కార్‌ప్లే విడుదల.. చాట్ లిస్ట్, కాల్ హిస్టరీ, ఫేవరెట్ కాంటాక్ట్స్.. పూర్తి వివరాలు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions