2 States Elections: బెంగాల్, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
- బెంగాల్ ఫేజ్-1, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్
- పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
- సా.5 గంటల వరకు జరగనున్న పోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఫేజ్-1 ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎండకాలం కావడంతో వడగాల్పుల భయంతో ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు క్యూ కట్టారు.
బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలు ఉండగా ఈరోజు 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సుమారు 3.6 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఫైటింగ్ జరుగుతోంది. ఇక తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ డీఎంకే-ఎన్డీఏ కూటమి, టీవీకే పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. 234 నియోజకవర్గాల్లో 4,023 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
Also Read
- PM Modi: ప్రధాని మోడీకి మెటా క్షమాపణలు.. సాంకేతిక లోపమే కారణమని స్పష్టీకరణ
- Supreme Court: విద్యార్థి నిరసనకారులకు ఊరట.. మైనర్లు, నేర చరిత్ర లేని వారిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
- Parliament Monsoon Session 2026: నేటి నుంచి సజావుగా పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఓం బిర్లా చొరవతో తొలగిన ప్రతిష్టంభన
- Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
ఇక రెండో విడతలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో 142 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. అనంతరం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.
ఓటర్లకు మోడీ విజ్ఞప్తి
తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ప్రారంభమైన సందర్భంగా పెద్ద ఎత్తున ఓటర్లు తరలి రావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ‘‘పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని ఓటర్లందరూ ప్రజాస్వామ్యమనే ఈ పవిత్ర కర్తవ్యంలో ఉత్సాహంగా పాల్గొనాలని నేను పిలుపునిస్తున్నాను. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ యువత, మహిళలు రికార్డు స్థాయిలో ఓటు వేయడానికి ముందుకు రావాలని నేను కోరుతున్నాను.’’ అని మోడీ పేర్కొన్నారు.
అమిత్ షా..
బెంగాల్ తల్లీకూతుళ్ల భద్రత కోసం ఓటు వేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఈరోజు బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్ జరుగుతోంది. ఈ బెంగాల్ ఎన్నికలు రాష్ట్ర వర్తమానానికీ, భవిష్యత్తుకూ కీలకం. బెంగాల్ జనాభా స్వరూపాన్ని మార్చేస్తున్న చొరబాటుదారులు, సిండికేట్లు, కట్-మనీ పాలన నుంచి రాష్ట్రాన్ని బలమైన నాయకత్వం ఉన్న ప్రభుత్వం మాత్రమే విముక్తి చేయగలదు. బెంగాల్ తల్లులు, కుమార్తెల కోసం సురక్షితమైన బెంగాల్‌ను నిర్మించడానికి ఈరోజు పెద్ద సంఖ్యలో ఓటు వేయండి. సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన బెంగాల్‌ను నిర్మించడానికి ఓటర్లందరూ..ముఖ్యంగా యువత, ముందుగా ఓటు వేసి, ఆ తర్వాత ఈరోజు అల్పాహారం తీసుకోవాలి.’’ అని పేర్కొన్నారు.
Phase 1 of the West Bengal Assembly elections takes place today. I urge all citizens to participate in this festival of democracy with full strength. I especially appeal to my young friends and to the women of West Bengal to vote in large numbers.
— Narendra Modi (@narendramodi) April 23, 2026
As Tamil Nadu votes in the Assembly elections, I call upon all voters to take part enthusiastically in this sacred duty of democracy. I urge the youth and the women of Tamil Nadu in particular to come out and vote in record numbers.
— Narendra Modi (@narendramodi) April 23, 2026
#WATCH | West Bengal Elections 2026 | Long queues of voters formed outside a polling station in Birbhum as polling for the first phase of State Assembly elections begins. pic.twitter.com/3g0WBwSV6L
— ANI (@ANI) April 23, 2026
తాజావార్తలు
-
Christopher Nolan: సత్యజిత్ రేకు క్రిస్టోఫర్ నోలన్ నివాళి.. ‘పథేర్ పాంచాలి’ అబ్బురపరిచిందన్న ఆస్కార్ దర్శకుడు!
-
Raaka Movie Update: ‘రాకా’ ఎంట్రీకి రంగం సిద్ధం.. ప్రేక్షకులకు గూస్బంప్స్!
-
Prabhas-Fauji: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే న్యూస్.. ఈసారి పీక్స్‌లో..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
PM Modi: ప్రధాని మోడీకి మెటా క్షమాపణలు.. సాంకేతిక లోపమే కారణమని స్పష్టీకరణ
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!