Prabhas-Fauji: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే న్యూస్.. ఈసారి పీక్స్‌లో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Fauji Movie Teaser Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటైన ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించి ఒక అదిరిపోయే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది డిసెంబర్ 3న ఫౌజీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రభాస్ లుక్ సినిమాపై ఒక్కసారిగా భారీ హైప్ క్రియేట్ చేసింది. యుద్ధభూమిలో ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయింది. దర్శకుడు హను రాఘవపూడి ప్రభాస్‌ను అంతకుమించి చూపించబోతున్నట్టుగా ఫస్ట్ లుక్‌తో స్పష్టమైంది.
ఇక ఈ సినిమా టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ‘ఫౌజీ’ సినిమా నుంచి టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఈ టీజర్ కట్ పీక్స్‌లో ఉంటుందని టాక్. ఇక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తుండగా.. ఆమె పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బ్యాలెన్స్ షూటింగ్‌ను వీలైనంత త్వరగా ఫినిష్ చేయడానికి కసరత్తులు చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రభాస్.. త్వరలోనే ఫౌజీ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసేందుకు మరోసారి ప్రభాస్ సిద్ధమవుతున్నాడు.
Also Read
- Unmadam OTT Release: మర్డర్ కేసు వెనుక ముచ్చెమటలు పట్టించే మైండ్ గేమ్స్!.. ఓటీటీలోకి మరో మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్..
- Awarapan 2: ‘అవారపన్ 2’ బాక్సాఫీస్ దుమ్మురేపింది.. తొలి రోజే ‘బట్వారా1947’ను మూడింతలు దాటేసిన ఇమ్రాన్ హష్మీ
- Venky Atluri: త్రివిక్రమ్ ఛాయలు.. వెంకీ అట్లూరి రైటింగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
- Sreeleela: ముంబైలో సెట్స్‌పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
తాజావార్తలు
-
CM Revanth Reddy: నియామకాలను బాధ్యతగా తీసుకున్నాం.. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
-
LPG e-KYC deadline 2026: ఆగస్టు 16 తర్వాత LPG సిలిండర్ రాదా?.. e-KYC తప్పనిసరి.. పూర్తి వివరాలు
-
CM Revanth Reddy: రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం..
-
Cyberabad: దారుణం.. ఆలయంలో మైనర్ బాలికపై పూజారి లైంగిక దాడి.!
-
CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో చుక్క నీటినీ వదులుకోం.. గోల్కొండ కోట వేదికగా సీఎం రేవంత్ భరోసా..
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!