Christopher Nolan: సత్యజిత్ రేకు క్రిస్టోఫర్ నోలన్ నివాళి.. ‘పథేర్ పాంచాలి’ అబ్బురపరిచిందన్న ఆస్కార్ దర్శకుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Christopher Nolan: ప్రపంచ సినీ చరిత్రలో కొంతమంది దర్శకుల ప్రభావం కాలాన్ని దాటి తరతరాలకు చేరుకుంటుంది. అలాంటి అరుదైన దర్శకుల్లో భారతీయ సినీ దిగ్గజం సత్యజిత్ రే ఒకరు. ఆయన సినిమాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కల్ట్ క్లాసిక్లుగా నిలుస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ స్టార్ దర్శకుడు, ఆస్కార్ విజేత క్రిస్టోఫర్ నోలన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సత్యజిత్ రే గొప్పతనాన్ని ప్రపంచానికి గుర్తు చేశాయి. న్యూయార్క్‌లోని ప్రముఖ క్రైటీరియన్ క్లోసెట్ సందర్శించిన సందర్భంగా నోలన్, సత్యజిత్ రే రూపొందించిన ప్రఖ్యాత అపు ట్రైలజీ బాక్స్ సెట్‌ను ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా రేను భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా అభివర్ణించిన నోలన్ ‘పథేర్ పాంచాలి’ తనను పూర్తిగా అబ్బురపరిచిందని వెల్లడించారు. ఆ సినిమాలో కథనం, ఎమోషన్స్ , రియాలిటీ తనపై చెరగని ముద్ర వేశాయని ఆయన చెప్పారు.
అదే సమయంలో ట్రైలాజీలోని మిగిలిన ‘అపరాజితో’, ‘అపూర్ సంసార్’లను ఇంకా చూడలేదని నోలన్ వెల్లడించారు. అందుకే మొత్తం సెట్ ను ఇంటికి తీసుకెళ్లి పూర్తిగా చూడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గ్రామీణ బెంగాల్ నేపథ్యంలోని అపు జీవిత ప్రయాణాన్ని చూపించే ఈ మూడు సినిమాలు ప్రపంచ సినీ చరిత్రలో క్లాసిక్లుగా గుర్తింపు పొందాయి. ఇప్పడు నోలన్ వ్యాఖ్యలు మరో కారణంతో కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల సోషల్ మీడియాలో కొందరు దర్శకుడు ఆదిత్య ధర్ ను సత్యజిత్ రేతో పోలుస్తూ చర్చలు ప్రారంభించారు. ‘ధురందర్’ వంటి సినిమా విజయం తర్వాత వచ్చిన ఈ పోలికలను సినీ అభిమానుల్లో చాలామంది తీవ్రంగా వ్యతిరేకించారు. సత్యజిత్ రేను ఇప్పటి దర్శకులతో పోల్చడం సరైనది కాదని చాలా మంది అభిప్రాయపడ్డారు.
Also Read
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
ఇక సత్యజిత్ రే విషయానికి వస్తే ఆయన గొప్ప కథలు తెరకెక్కించిన దర్శకుడు మాత్రమే కాదు, సమాజంలోని మూఢనమ్మకాలు, కట్టుబాట్లను ప్రశ్నించిన సృజనకర్త కూడా. 1960లో విడుదలైన ‘దేవి’ సినిమాలో మత ఛాందసవాదం ఒక యువతి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆయన హృదయానికి హత్తుకునేలా చూపించారు. అయితే ఆ సినిమా మతాన్ని కాదు, మూఢనమ్మకాల వల్ల జరిగే నష్టాన్ని మాత్రమే విమర్శిస్తుందని రే స్వయంగా అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. తనకు నచ్చిన కథలను చెప్పే హక్కు ప్రతి దర్శకుడికి ఉందనే అభిప్రాయాన్ని కూడా ఆయన ధైర్యంగా వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ స్వయంగా సత్యజిత్ రే చిత్రాలను కొనుగోలు చేసి, వాటి ప్రభావాన్ని బహిరంగంగా ప్రశంసించడం ఆయన వారసత్వానికి మరో గొప్ప గుర్తింపుగా నిలిచింది. ‘పథేర్ పాంచాలి’ విడుదలై దాదాపు ఏడు దశాబ్దాలు గడిచినా, సత్యజిత్ రే సినిమాలు ఇప్పటికీ ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులను సైతం ప్రేరేపిస్తుండటం ఆయన సృజనాత్మక శక్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
తాజావార్తలు
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?