Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
- మమతా బెనర్జీ భయపడుతోంది..
- ఇలా ప్రతీ ప్రాంతానికి పరిగెత్తడం ఎప్పుడూ చూడలేదు..
- ఎన్నికల సంఘం పనితీరు భేష్..
- ప్రజలు నిర్భయంగా ఓటేస్తున్నారు..
- కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adhir Ranjan Chowdhury: పశ్చిమ బెంగాల్‌లో చివరిదైన రెండో విడత ఎన్నికలు బుధవారం జరుగుతున్నాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే, రెండో విడతలో 142 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
భుదవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “మమతా బెనర్జీ తన నియోజకవర్గంలో ఒక బూత్ నుండి మరొక బూత్‌కు పరుగెత్తడం మనం చూడటం ఇదే మొదటిసారి. ఇలా మునుపెన్నడూ చూడలేదు. ఆమె కళ్లలో, ముఖంలో స్పష్టమైన ఆందోళన కనిపిస్తోంది. నిజానికి, ఈసారి గెలుస్తాననే నమ్మకం ఆమెకు అస్సలు లేదు.” అని అన్నారు. భవానీపూర్ వంటి నియోజకవర్గంలో కూడా ముఖ్యమంత్రి స్వయంగా పరిస్థితిని సమీక్షించడానికి రావడం చూస్తే ఆమె రాజకీయ పరిస్థితి అర్థమవుతుందని ఆయన అన్నారు.
Also Read
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
Read Also: Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్‌మిలన్ ధరలు..
ఈసారి బెంగాల్ ఎన్నికల్లో భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీటు నుంచే బీజేపీ కీలక నేత సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. మమతా బెనర్జీని 2021 ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి సువేందు ఓడించారు. ఈసారి భవానీపూర్ నుంచి కూడా ఓడించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో భవానీపూర్ లోని ప్రతీ ప్రాంతంలో పోలింగ్ రోజున మమతా పర్యటించారు.
బెంగాల్ బర్హంపూర్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, ఎన్నికల సంఘం ఏర్పాట్లను ప్రశంసించారు. తొలిసారిగా బెంగాల్‌లో ప్రజలు ఎలాంటి భయం లేకుండా ఓట్లు వేస్తున్నారని అన్నారు. బెంగాల్‌లో హింసా సంస్కృతి టీఎంసీ వ్యూహంలో భాగమని ఆయన ఆరోపించారు. ఇక్కడ భారీ స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించడంతో ప్రజలు నిర్భయంగా ఓటేస్తున్నారని అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!