Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News West Bengal Election Results Bjp Victory New Cm Swearing In May 9

West Bengal: దిగిపోయిన దీదీ.. రాబోతున్న బీజేపీ! మే 9న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం..

Published Date :May 5, 2026 , 1:38 pm
By Shiva Ganesh
  • తృణమూల్ 15 ఏళ్ల పాలనకు ముగింపు
  • 206 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ
  • సీఎం అభ్యర్థిగా సువేందు అధికారి పేరు..
West Bengal: దిగిపోయిన దీదీ.. రాబోతున్న బీజేపీ! మే 9న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన బీజేపీ, ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన భారతీయ జనతా పార్టీ (BJP), మే 9వ తేదీన కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య మంగళవారం వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీలో ఇంకా అంతర్గత చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే పేరును ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ విజయంతో పశ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘకాలంగా సాగిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) పాలనకు తెరపడింది.

కేంద్రం – రాష్ట్రంలో ఒకే పార్టీ
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 206 స్థానాల్లో గెలుపొంది, మూడింట రెండొంతుల మెజారిటీని సాధించింది. ప్రతిష్టాత్మకమైన భవానీపూర్ స్థానంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఘనవిజయం సాధించారు. 1972 తర్వాత బెంగాల్‌లో కేంద్రంలో ఉన్న పార్టీయే రాష్ట్రంలోనూ అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. దీనివల్ల రాష్ట్ర పరిపాలనలో, రాజకీయ సమీకరణాల్లో పెను మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయోత్సవాల అనంతరం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. బెంగాల్ భయం నుంచి విముక్తి పొందిందని ఆయన అన్నారు. “బెంగాల్‌లో దశాబ్దాలుగా సాగుతున్న రాజకీయ హింసా సంస్కృతికి నేటితో ముగింపు పడాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రతీకారం కాదు, మార్పు. భయం గురించి కాదు, భవిష్యత్తు గురించి చర్చ జరగాలి” అని ప్రధాని పిలుపునిచ్చారు. రాజకీయ హింసను వీడి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Also Read

  • West Bengal: బీజేపీ విజయం తర్వాత తెరుచుకున్న దుర్గా ఆలయం.. భక్తుల్లో ఆనందోత్సాహం
  • Congress Comeback: ఐదు రాష్ట్రాల పోరులో అతిపెద్ద లబ్ధిదారు కాంగ్రెస్సే ! బీజేపీకి మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇదే..
  • One Vote Victory: ఒక్క ఓటుతో గెలుపు.. తిరుపత్తూరులో టీవీకే అభ్యర్థి సంచలన విజయం!
  • Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?

బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకే ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BJP Victory in West Bengal
  • Mamata Banerjee Defeat Bhabanipur
  • PM Modi speech on Bengal Victory
  • Suvendu Adhikari West Bengal CM candidate
  • TMC 15-year rule ends

తాజావార్తలు

  • Gudivada Amarnath: జగన్‌ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!

  • West Bengal: దిగిపోయిన దీదీ.. రాబోతున్న బీజేపీ! మే 9న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం..

  • Bollywood : బాలీవుడ్‌లో సత్తా చాటలేకపోతున్న సౌత్‌ స్టార్స్‌.. ఇక్కడ టాప్‌ పొజిషన్‌.. హిందీలో ఫ్లాపులు

  • Achari Lauki Salad Recipe: వేసవిలో చల్లని సొరకాయ ఊరగాయ సలాడ్.. సులభమైన టేస్టీ రెసిపీ..

  • Gold and Silver Prices: మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions