Amit Shah: గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: పశ్చిమ బెంగాల్లో బీజేపీ సర్కార్ ఏర్పడబోతోంది. బీజేపీ తొలి సీఎంగా సువేందు అధికారిని ఎన్నుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో శుక్రవారం కోల్‌కతాలో జరిగిన శానసభ పక్ష సమావేశంలో సీఎం ఎన్నిక జరిగింది. బీజేపీపై విశ్వాసం ఉంచడం ద్వారా ప్రజలు ‘‘నిర్బయ బెంగాల్’’ దిశగా ఒక అడుగు వేశారని షా అన్నారు. బీజేపీ, ప్రధాని మోడీపై విశ్వాసాన్ని ఉంచి బెంగాల్ ప్రజలు భారీ విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు.
కమ్యూనిస్ట్ పాలన నుంచి బెంగాల్లో భయం, హింసాత్మక వాతావరణం ఉందని, ఇది ఆ తర్వాత తీవ్రంగా మారిందని అమిత్ షా ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్ ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారని అన్నారు. ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ‘‘సోనార్ బంగ్లా’’(బంగారు బెంగాల్) లక్ష్యంతో ముందుకు సాగుతామని చెప్పారు. బెంగాల్ భయం రహిత సమాజం దిశగా వెళ్తుందని అన్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
గత 5 దశాబ్ధాలుగా బెంగాల్ శాంతిభద్రతలు, ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ పరంగా తీవ్రమైన ప్రతికూల రాజకీయాలను చూసిందని.. బెంగాల్ ప్రజలకు ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఇప్పుడు బీజేపీ బాధ్యత అని అన్నారు. బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేస్తూ, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, శ్రీ అరబిందో, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి వారు కోరుకున్న బెంగాల్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు.
Read Also: Kerala Chief Minister: కేరళ సీఎం ఈయనేనా.?
ఈ విజయం చాలా ముఖ్యమైందని, 1950లో ప్రారంభమైన సైద్ధాంతిక ప్రయాణం నేడు బెంగాల్‌కు చేరుకుందని, శ్యామా ప్రసాద్ ముఖర్జీ జన్మస్థలంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుండటం ఒక చారిత్రక ఘట్టమని చెప్పారు. 2014లో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం ఇప్పుడు గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు చేరిందని ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయని చెప్పారు. ఈ విజయం కోసం 321 మంది బీజేపీ కార్యకర్తలు తమ ప్రాణాలను కోల్పోయారని, ఈ విజయం సులభంగా రాలేదని అమిత్ షా వెల్లడివంచారు.
త్రిపుర, అస్సాం, బెంగాల్‌లలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడటంతో సరిహద్దు భద్రతను మరింత పెరుగుతుందని, అక్రమ రవాణా, చొరబాట్లను కఠినంగా అణిచివేస్తామని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా చొరబాటుదారుల్ని గుర్తించి వారిని తరిమివేసి, చొరబాటురహిత దేవంగా మారుస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మమతా బెనర్జీని ఆమె సొంత ఇంటిలో భవానీపూర్‌లో ఓడించి శక్తివంతమైన సందేశాన్ని పంపినట్లు అమిత్ షా చెప్పారు. ఈ విజయంతో బీజేపీపై మరింత బాధ్యత పెరిగిందని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హింస, కక్షపూరిత రాజకీయాలకు తావు ఉండకూడదని కార్యకర్తల్ని కోరారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..