PM Modi: సొంత రాష్ట్రం గుజరాత్‌లో కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ‘‘నకిలీ ఫ్యాక్టరీ’’ని నడుపుతోందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇటీవల అమిత్ షా చెప్పినట్లు డీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పంచుకున్నారు.
ఈ రోజు బయస్కాంతలో జరిగి ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ ఫేక్ వీడియోల మార్కెట్‌ను తెరిచింది. ఎన్నికల్లో ఏం మాట్లాడినా పనికిరాదని వారికి తెలుసు కాబట్టే ఇప్పుడు ఫేక్ వీడియోలు తీస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, 60 ఏళ్లుగా దేశాన్ని పాలించిన, ఎంతో మంది ప్రధాన మంత్రులు కలిగిన పార్టీ ప్రజలతో నిజాలు మాట్లాడదు’’ అని ఆయన విమర్శించారు. ప్రేమ దుకాణం అని చెప్పుకుని ద్వేషపూరిత మార్కెట్‌ని తెరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని కాంగ్రెస్ చూస్తోందని అన్నారు.
Read Also: Michael Vaughan: టీ20 ప్రపంచ కప్లో సెమీ ఫైనల్ వెళ్లే జట్లు ఇవే.. టీమిండియాకు నో ఛాన్స్..!
రాజ్యాంగాన్ని మార్చడానికి, రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ 400 సీట్లు కోరుతోందని ఆ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తో్ందని కాంగ్రెస్‌ని విమర్శించారు. ఎన్డీయేలో లేని బిజూ జనాతాదళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మద్దతుతో ఐదేళ్ల పాటు తమకు 400 మంది ఎంపీలు ఉన్న సంగతి కాంగ్రెస్ పార్టీకి తెలియదా.. కానీ మేం రిజర్వేషన్లు తీసేసే పాపం చేయడానికి పుట్టలేదని మోడీ అన్నారు. ఇదే దారిలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం స్వచ్ఛతను కాపాడుకుంటామని, మోడీ జీవించి ఉన్నంత వరకు మతం అధారంగా రిజర్వేషన్లను అనుమతించనని అన్నారు. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు, సాధారణ కేటగిరీలోని పేదలకు ఇచ్చిన రిజర్వేషన్లు రాజ్యాంగం ఆధారంగానే ఇచ్చామని, దానిని ఎవరూ మార్చలేరని ప్రధాని తన సభకు హామీ ఇచ్చారు.
రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. యువరాజు, కాంగ్రెస్ ళితులు, గిరిజనులు, OBCలు మరియు పేదల నుండి రిజర్వేషన్లను లాక్కోవాలని, మతం ఆధారంగా ముస్లింలకు ఇవ్వాలని కోరుకుంటోందని అన్నారు. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో తమ ఓటు బ్యాంకు కోసం రిజర్వేషన్లు తీసేయాలని కాంగ్రెస్ చూస్తోందని, అందుకే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రధాని అన్నారు. గుజరాత్‌లోని మొత్తం 26 స్థానాలకు మే 7న మూడో దశలో ఓటింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.