Ritika Sajdeh Trolled After All Eyes On Rafah Post: గాజాలోని రఫా నగరంలో ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పిల్లలు, మహిళలు సహా 45 మంది పాలస్తీనా పౌరులు చనిపోయారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని కలిచివేస్తున్నాయి. దీంతో పాలస్తీనా పౌరులకు మద్దతుగా అంతర్జాతీయంగా అనేక మంది సెలబ్రిటీలు గళమెత్తారు. ఈ క్రమంలోనే ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ అనే పదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇజ్రాయెల్ దాడిపై పాలస్తీనాకు మద్దతుగా భారత దేశానికి చెందిన చాలామంది పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే కూడా రఫా మారణహోమంపై స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ అని రాసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. కశ్మీరీ పండిట్లు, మణిపుర్ హింస.. దేశంలో నెలకొన్న సమస్యలపై ఎప్పుడైనా స్పందించారా? అంటూ నెటిజన్లు రితికను ప్రశ్నించారు. ట్రెండ్‌ను ఫాలో అవుతూ పోస్టులు చేయడం సరికాదని విమర్శలు గుప్పించారు. దీంతో రితిక ఆ స్టోరీని డిలీట్ చేశారు.
Also Read: Hardik Pandya: లండన్‌కు హార్దిక్ పాండ్యా.. నేరుగా అమెరికాకు!
పాలస్తీనాకు మద్దతుగా భారత్ నుంచి చాలా మంది సెలెబ్రెటీలు పోస్ట్‌లు చేశారు. సౌత్ స్టార్స్ రష్మిక మందన్న, త్రిష కృష్ణన్, సమంత, మాళవికా మోహనన్, దుల్కర్ సల్మాన్.. బాలీవుడ్ నటులు కాజోల్, అమీ జాక్సన్, అలియా భట్, కరీనా కపూర్, ప్రియాంకా చోప్రా, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, త్రిప్తి డిమ్రి, దియా మీర్జా, రిచా చద్దా పాలస్తీనాకు తమ సంఘీభావాన్ని తెలిపారు. కాజోల్ కూడా తన పోస్టును తొలగించడం విశేషం.