Waqf bill: రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు..
- రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు..
- ఇప్పటికే ఆమోదం తెలిపిన జేపీసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf bill: సోమవారం లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు రానుంది. ఇప్పటికే ఈ బిల్లుపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వక్ఫ్ బిల్లుని ఆమోదించింది. జనవరి 30న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకి నివేదికను సమర్పించారు. బిజినెస్ లిస్ట్ ప్రకారం.. జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్, బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్ కలిసి వక్ఫ్ సవరణ బిల్లు-2024పై జేపీసీ రిపోర్టుని హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లలో సభ ముందుంచనున్నారు. అంతకుముందు జనవరి 29న ముసాయిదా నివేదికను, సవరించిన బిల్లుని జేపీసీ ఆమోదించింది.
Read Also: Budget 2025 : బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆర్థిక మంత్రిని చుట్టుముట్టిన ఎంపీలు, ప్రధాని.. ఎందుకంటే ?
Also Read
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
జేపీసీ మొత్తం 14 నిబంధనలలో 25 సవరణలతో వక్ఫ్ బిల్లు -1995కి సవరణలు చేసింది. అయితే, తమ అభిప్రాయాలను, సవరణలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా జేపీపీ వ్యవహరించిందని కాంగ్రెస్‌తో సహా విపక్ష ఎంపీలు ఆరోపించారు. వక్ఫ్ ఆస్తుల్ని నియంత్రించడానికి 1995 వక్ఫ్ చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే, ఇది అపరిమిత అధికారాలతో దుర్వినియోగం, అవినీతి, ఆక్రమణలు వంటి సమస్యలకు దారి తీసిందనే ఉద్దేశంతో బిల్లుని సవరించాలని కేంద్రం నిర్ణయించింది.
ఇదిలా ఉంటే, ప్రతిపక్ష సభ్యుడు, కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ బిల్లుపై తన అసమ్మతి నోట్‌లోని విభాగాలను తనకు తెలియకుండానే సవరించారని ఆరోపించారు. ప్రతిపక్ష గొంతులను అణిచివేసే ప్రయత్నంగా అభివర్ణించారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ విమరణాత్మక అలసమ్మతి నోట్‌ని తాను సమర్పించానని, ఆశ్చర్యకరంగా నా అసమ్మతి నోట్‌లోని కొన్ని భాగాలను నాకు తెలియకుండానే సవరించారని అన్నారు.
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!