Mahua Moitra: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు మరోసారి అదానీ వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. బిలయన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్‌లో ఒక కేసు నమోదైంది. నిధుల సేకరణ కోసం లంచం ఇచ్చేందుకు ట్రై చేశారని యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ అభియోగాలు మోపింది. అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదైంది. 2 బిలియన్ డాలర్ల లాభం పొందేందుకు సోలార్ ఎలక్ట్రిసిటీ సప్లై కాంట్రాక్ట్ కోసం 250 మిలియన్ డాలర్లను లంచం ఇచ్చినట్లు అభియోగాలు నమోదైయ్యాయి. అయితే, అదానీ గ్రూప్ ఈ ఆరోపణల్ని ఖండించింది. నేరారోపణ తర్వాత అదానీ గ్రూప్ 600 మిలియన్ డాలర్ల బాండ్ ఆఫర్‌ని రద్దు చేయాలని నిర్ణయించుకుంది.
Read Also: New Survey: దేశ ప్రజలు ఎక్కువగా నమ్ముతుంది వీరినే.. సర్వే జాబితాలో వైద్యులు, ఆర్మీ, పొలిటీషియన్స్.
ఈ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు. అదానీపై విరుచుకుపడ్డారు. యూఎస్ నేరారోపణలపై బీజేపీ మద్దతుదారులు, అదానీ గ్రూప్ మౌనం వహించడాన్ని గురువారం ఆమె ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మోడీజీ ట్రంప్‌కి కాల్ చేస్తారా..? అని వ్యంగ్యంగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మహువా మోయిత్రా సెబీని విమర్శి్స్తూ..‘‘గుడ్ మార్నింగ్ శ్రీమతి మధాబి, అదానీకి వ్యరేకంగా రుజువులు లేవు. గుడ్ మార్నింగ్ వెన్నెముక లేని రాజీ పడిని సెబీ’’ అంటూ ట్వీట్ చేశారు. అదానీ గ్రూప్‌పై US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ (SEC) ప్రెస్ రిలీజ్‌ను షేర్ చేస్తూ..‘‘ మీ బ్రదర్ డీలింగ్స్‌ని వివరించే ప్రెస్ రిలీజ్ ఇక్కడ ఉంది’’ అని ఆమె కామెంట్ చేశారు.
Silence from both Bhakts & @AdaniOnline. Waiting for Modiji to dial @realDonaldTrump to help sort out ?!
— Mahua Moitra (@MahuaMoitra) November 21, 2024