New Survey: మనదేశంలో ప్రజలు ఎక్కువగా వైద్యులు, ఉపాధ్యాయులు, ఆర్మీని ఎక్కువగా నమ్ముతున్నట్లు ఒక సర్వేలో వెల్లడైంది. గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ సంస్థ అయిన ఇప్సోస్ ఈ సర్వే చేసింది. 32 దేశాల్లో ఈ సర్వేని నిర్వహించింది. అయితే, మనదేశం విషయానికి వస్తే దేశంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ మంత్రులు, మత పూజారులను తక్కువగా నమ్ముతున్నట్లు తేలింది.
ప్రపంచవ్యాప్తంగా 23,530 మంది పెద్దలను సర్వే చేశారు. వీరిలో 2200 మంది భారత్‌కి చెందిన వారు ఉన్నారు. అర్బన్ ఇండియన్ ఎక్కువగా 57 శాతం మంది డాక్టర్లను, ఆ తర్వార సాయుధ దళాలను(56 శాతం), టీచర్స్(56 శాతం)లపై విశ్వాసం ఉంచుతున్నట్లు తేలింది. కోవిడ్ సమయంలో వీరు ఫ్రంట్ లైన్ వర్కర్లుగా కీలక పాత్ర పోషించారు. తర్వాతి స్థానాల్లో శాస్త్రవేత్తలు (54 శాతం), న్యాయమూర్తులు (52 శాతం), బ్యాంకర్లు (50 శాతం), సాధారణ పురుషులు మరియు మహిళలు (49 శాతం),పోలీసులు (47 శాతం) ఉన్నారు.
భారతదేశంలో రాజకీయ నాయకులు(31 శాతం), ప్రభుత్వ మంత్రులు(28 శాతం), మతాధికారులు/పూజారులు (27 శాతం) అతి తక్కువగా విశ్వసిస్తున్నట్లు గుర్తించబడ్డారు. వీరు ఎక్కువగా కుంభకోణాలు, ఇతర నేరాల్లో ఉంటున్న కారణంగా వీరిపై విశ్వసనీయత తగ్గింది. అవిశ్వాస జాబితాలో అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్‌లు (25 శాతం), మరియు టీవీ న్యూస్ యాంకర్లు (25 శాతం) ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వైద్యులు 58 శాతం), శాస్త్రవేత్తలు (56 శాతం), ఉపాధ్యాయులు (54 శాతం) కూడా అత్యంత విశ్వసనీయ వృత్తులుగా అవతరించారు. భారత్‌లో మాదిరిగానే ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులపై అపనమ్మకం ఎక్కువగా ఉంది.