VS Babu: సొంత ఇలాకాలో కుప్పకూలిన సీఎం స్టాలిన్.. సీఎంను కోటను పెకిలించిన వి.ఎస్. బాబు ప్రస్థానం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VS Babu: తమిళనాడు రాజకీయాల్లో ఒక సామాన్య అభ్యర్థి సిట్టింగ్ ముఖ్యమంత్రిని ఓడించడం అనేది దాదాపు అసాధ్యం. కానీ 2026 అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో తమిళగ వెట్రి కజగం (TVK) అభ్యర్థి వి.ఎస్. బాబు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. కొలత్తూరు నియోజకవర్గంలో ఎం.కె.స్టాలిన్‌ను ఓడించి, దేశ రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు.
ఎవరీ వి.ఎస్. బాబు..
వి.ఎస్. బాబు తమిళనాడు రాజకీయాల్లో నిన్నమొన్న వచ్చిన వ్యక్తి కాదు. ఆయన చెన్నై రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు. 2006 శాసనసభ ఎన్నికల్లో పురసవాక్కం నియోజకవర్గం నుంచి ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2006 నుంచి 2011 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నీటి సరఫరా, గృహ నిర్మాణ సమస్యలపై పోరాడి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read
- Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
- Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్‌పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
టీవీకేలో చేరిక.. కీలక మలుపు
దశాబ్దాల పాటు ద్రవిడ రాజకీయాల్లో ఉన్న బాబు, ఫిబ్రవరి 7, 2026న నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీలో చేరారు. విజయ్ నాయకత్వంలోని కొత్త శక్తికి బాబు వంటి అనుభవజ్ఞుడైన నాయకుడు తోడవ్వడం ఆ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. విజయ్ కూడా ఆయనపై నమ్మకంతో ఏకంగా ముఖ్యమంత్రి స్టాలిన్ పోటీ చేస్తున్న కొలత్తూరు బరిలో నిలబెట్టారు. అయితే అనూహ్యంగా ఈ ఎన్నికల్లో బాబు ఏకంగా సీఎం స్టాలిన్‌ను తన కంచుకోటగా భావించే కొలత్తూరులో మట్టికరిపించారు. నిజానికి ఈ ఎన్నికల్లో వి.ఎస్.బాబు కేవలం గాలివాటంగా గెలవలేదు. ఆయన ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చెన్నై ఓటర్ల నాడి తెలిసిన నాయకుడిగా బాబు ప్రతి ఇంటిని పలకరించారు. సీనియర్ నాయకుడిగా బూత్ స్థాయిలో ఓటర్లను సమీకరించడంలో తన పాత అనుభవాన్ని రంగరించారు. ద్రవిడ పార్టీల పాలనపై ఉన్న అసంతృప్తిని తన వైపు తిప్పుకోవడంలో ఆయన సఫలమయ్యారు.
వి.ఎస్. బాబు రాజకీయ ప్రస్థానం ఇదే..
2006 లో డీఎంకే అభ్యర్థిగా పురసవాక్కం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2006-2011: శాసనసభ సభ్యునిగా పౌర సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర.
ఫిబ్రవరి 2026: డీఎంకేను వీడి తమిళగ వెట్రి కజగం (TVK)లో చేరిక.
మే 2026: కొలత్తూరులో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను ఓడించి ‘జెయింట్ కిల్లర్’గా గుర్తింపు.
తాజావార్తలు
-
FEFSI : కోలీవుడ్‌లో సమ్మె సైరన్‌పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
-
Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
-
Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!