Vodafone Idea: భారీగా యూజర్లను కోల్పోతున్న వొడాఫోన్ ఐడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vodafone Idea Suffers Subscriber Loss As Jio, Airtel Add To User Tally: జియో, ఎయిర్ టెల్ సంస్థలు కొత్త సబ్‌స్క్రైబర్‌లను పెంచుకుంటూ పోతుంటే.. వొడాఫోన్ ఐడియా మాత్రం తమ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోతోంది. సెప్టెంబర్ నెలలో టెలికాం రెగ్యులేటర్ డేటా ప్రకారం.. భారతదేశంలో మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్యలో 30.6 లక్షల మంది తగ్గారు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ వినియోగదారులు పెరగగా.. వొడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్ల సంఖ్య క్షీణించింది.
Read Also: Shraddha Walker: ఆ పని చేసింది.. తట్టుకోలేక చంపేశా.. కోర్టులో అఫ్తాబ్
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
భారతదేశపు అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ అయిన జియో సెప్టెంబర్ నెలలో 7.2 లక్షల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను పెంచుకుంది. మార్కెట్ లో మరసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మరో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ కూడా తన వినియోగదారుల సంఖ్యను మరో 4.12 లక్షలకు పెంచుకుంది. మొత్తంగా సెప్టెంబర్ నెలలో రిలయన్స్ జియో ఎక్కువ సబ్‌స్క్రైబర్‌లను సంపాదించుకున్నప్పటికీ.. ఆగస్టు నెలలో 32.81 లక్షల సబ్‌స్క్రైబర్‌ల కన్నా ఇది చాలా తక్కువ. ఇక వొడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య పడిపోయింది. ఏకంగా 40 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు తగ్గారు.
మొత్తం వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి 114.9 కోట్లు ఉంటే సెప్టెంబర్ చివరినాటికి 114.54కు తగ్గిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తెలిపింది. మొత్తం మీద భారతదేశంలో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ( మొబైల్, బ్రాడ్ బ్యాండ్, టెలిఫోన్) సెప్టెంబర్ 2022 చివరి నాటికి దాదాపుగా 117.19 కోట్లకు తగ్గింది. మొత్తంగా 0.27 శాతం నెలవారీ క్షీణత నమోదు అయింది. ఇక సెప్టెంబర్ 2022 చివరి నాటికి మొత్తం బ్రాడ్ బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు 81.6 కోట్లకు పెరిగిందని, నెలవారీ వృద్ధి రేటు 0.28 శాతంగా ఉందని ట్రాయ్ వెల్లడించింది. సెప్టెంబర్ నాటికి ఇండియాలో 41.9 కోట్ల వినియోగదారులతో రిలియన్స్ జియో మొదటిస్థానంలో ఉండగా.. 36.4 కోట్లతో ఎయిర్ టెల్ రెండో స్థానంలో, 24.9 కోట్లతో వొడాఫొన్ మూడోస్థానంలో ఉంది.
తాజావార్తలు
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
-
Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
-
E85 Flex Fuel Vehicles: చౌకైన E85 పెట్రోల్ తో నడిచే వాహనాలు.. భారత్‌లో ఏవి కొనవచ్చు? కార్లు & బైకులు పూర్తి జాబితా!
-
Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?