Site icon NTV Telugu

Viral news: భార్యను చదివించిన భర్త.. జాబ్ వచ్చాక వదిలేసిన భార్య..

Uttarapradesh Husband

Uttarapradesh Husband

ఈరోజుల్లో మహిళలు మహా ముదురులు అవుతున్నారు.. ఇప్పటికి కొందరు మహిళలు భర్తను దైవంగా భావిస్తున్నారు.. మరి కొందరు మహిళలు భర్తను వదిలేసి వేరే వాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు.. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు లోకి వచ్చింది.. భార్య పై ఓ వ్యక్తి ఎనలేని ప్రేమను పెంచుకున్నాడు.. ఆమె అడిగితే ఏదైనా కాదనకుండా ఇచ్చేవాడు.. అలా ఆమెకు ఇష్టమైన చదువును చదివించాడు.. అదే అతను చేసిన పెద్ద తప్పు అని ఇప్పటికి అతనికి అర్థమైంది.. ఉద్యోగం వచ్చాక భర్తను వదిలేసి వేరే వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తనే వదిలేసింది.. ఈ విషయాన్ని భర్త చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది..

వివరాల్లోకి వెళితే.. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది..ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అలోక్ మౌర్య అనే వ్యక్తి తన భార్య జ్యోతి కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. వచ్చిన ప్రతీ రూపాయి కూడబెట్టాడు, పైగా కొంత అప్పు కూడా చేశాడు. ఇలా ఓ కోచింగ్ సెంటర్‌లో చేర్పించి తన భార్యను చదివించాడు. చివరికి ఆమె కూడా ఆ పరీక్షలో పాస్ అయ్యి.. సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ పోస్టు సాధించింది. కట్ చేస్తే.. తన భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందన్న అతడి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఆమె ప్రవర్తనలో మార్పు రావడం మొదలైంది. భర్తపై చులకన భావం పెరిగింది. అంతేకాదు.. ఏకంగా మరో అఫీసర్‌తో వివాహేతర సంబంధాన్ని కూడా పెట్టుకుంది..

ఆ విషయం కాస్త భర్తకు తెలియడంతో ఆమెను నిలదీసాడు.. దానికి అతనితో గొడవ పెట్టుకోవడం మాత్రమే కాదు..అతడిపై వరకట్నం కేసు పెట్టి జైలుపాలు చేసింది జ్యోతి. అనంతరం కొద్దిరోజులకు బెయిల్‌పై బయటకొచ్చాడు అలోక్. తన పరువుతో పాటు ఉద్యోగం కూడా పోయిందని మీడియా ముందు వాపోయాడు. విడాకులు ఇవ్వాలంటూ జ్యోతి తనను వేధింపులకు గురి చేస్తోందని, ఆమె ఫిర్యాదు చేసినా.. ఎవరూ తన గోడు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు..ఇందుకు సంబందించిన వీడియో వైరల్ కావడంతో అసలు విషయం బయటకు వచ్చింది..

Exit mobile version