Vinesh Phogat: రాజ్యసభకు వినేష్ ఫోగట్..! కాంగ్రెస్ ప్లాన్ ఇదేనా?
- రాజ్యసభకు వినేష్ ఫోగట్..!
- కాంగ్రెస్ ప్లాన్ ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ మ్యాచ్‌కు ముందు వేటుకు గురైన భారత్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌ను రాజ్యసభకు పంపాలని డిమాండ్ పెరిగింది. ఆమె బహిష్కరణకు గురైనప్పుడు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. తాజాగా హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా… వినేష్‌ను రాజ్యసభకు పంపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయన కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ సింగ్ హుడా కూడా అదే పల్లవి అందుకున్నారు. ధైర్యం, స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన ఆమె.. రాజ్యసభ పదవికి తగిన వ్యక్తి అని దీపిందర్ హుడా వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై వినేష్ ఫోగట్ పెద్దనాన్న మహవీర్ ఫోగట్ స్పందించారు. భూపిందర్ సింగ్ హుడా కూడా హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గీతా ఫోగట్‌ను ఎందుకు రాజ్యసభకు పంపించలేదని ప్రశ్నించారు. గీతా మహవీర్ కుమార్తె. గీతా ఫోగట్ ప్రముఖ భారతీయ మహిళా కుస్తీ క్రీడాకారిణి. 2010లో జరిగిన కామన్ వెల్త్ ఆటల్లో భారతదేశానికి మొట్టమొదటిసారి బంగారు పతకం తెచ్చింది. ఒలంపిక్స్‌కు ఎంపికైన తొలి మహిళా కుస్తీ క్రీడాకారిణి కూడా గీతానే కావడం విశేషం.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే ఒలింపిక్స్ ఫైనల్లో అనర్హతకు గురి కావడంతో వినేష్ మనస్తాపానికి గురైంది. దీంతో ఆమె రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్లో పోస్టు చేసింది. ‘‘తల్లిలాంటి కుస్తీ నా మీద గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి. మీ కల, నా ధైర్యం విచ్ఛిన్నమయ్యాయి. ఇక పోరాడే బలం లేదు. మీ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటా’’ అని వినేష్ పేర్కొంది.
తాజాగా కాంగ్రెస్ కొత్త పల్లవి అందుకోవడం వెనుక వ్యూహం ఉందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకు వినేష్‌కు రాజ్యసభ సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బుధవారం దేశ వ్యాప్తంగా ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ స్థానంలో ఏదొకటి వినేష్‌కు కేటాయిస్తే.. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి దోహదపడుతుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా సమాచారం.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!