Site icon NTV Telugu

Babita Phogat: కాంగ్రెస్ సీనియర్ నేతపై బబిత ఫైర్.. కుటుంబంలో గొడవలు సృష్టించారని ఆగ్రహం

Babitaphogat

Babitaphogat

భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌ కాంగ్రెస్‌లో చేరాక కుటుంబం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోమవారం వినేష్ పెద్దనాన్న మహవీర్ ఫోగట్ స్పందిస్తూ.. వినేష్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తదుపరి ఒలింపిక్స్‌పై గురి పెట్టకుండా రాజకీయాల్లో రావడం చాలా పెద్ద తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఆమె బంధువు, బీజేపీ నేత బబిత ఫోగట్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై నిప్పుల చెరిగారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: 10 రోజుల తర్వాత నివాసానికి సీఎం.. ప్రతీ రోజూ క్షేత్రస్థాయి పర్యటన

కాంగ్రెస్ సీనియర్ నేత భూపీందర్ హుడా పన్నిన పన్నాగంలో కుటుంబంలో చీలిక వచ్చిందని బబిత ఆరోపించారు. కాంగ్రెస్ విధానమే విభజన విధానం అని దుమ్మెత్తిపోశారు. రాజకీయ లబ్ధి కోసమే వినేష్ ఫోగట్ కుటుంబంలో కాంగ్రెస్ చీలిక తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. విభజించి పాలించడమే కాంగ్రెస్ అజెండా అని.. కుటుంబాలను విచ్ఛిన్నంగా చేయడమే లక్ష్యంగా హస్తం పార్టీ పని చేస్తోందని ధ్వజమెత్తారు. వినేష్.. తన పెద్దనాన్న మహవీర్ ఫోగట్ సలహాను పాటించాలని విజ్ఞప్తి చేశారు. మహవీర్.. వినేష్ గురువు.. ఆయనే సరైన మార్గదర్శకత్వంలో మార్గం చూపిస్తారని హితవు పలికారు. 2028లో వినేష్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకునే సత్తా ఉందన్నారు. రాజకీయాలను వదిలి రెజ్లింగ్‌పై దృష్టి పెట్టాలని వినేష్‌కు బబిత సూచించారు.

ఇది కూడా చదవండి: Heart Diseases: గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ మధ్య తేడాలేంటి..? ఏ విధంగా గుండెపై ప్రభావం చూపిస్తాయి.?

వినేష్ ఫోగట్ సెప్టెంబర్ 6న కాంగ్రెస్‌లో చేరారు. కొద్ది సేపటికే జులానా నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. 2019లో బీజేపీలో చేరిన బబితకు మాత్రం ఈ ఎన్నికల్లో కమలం పార్టీ సీటు కేటాయించలేదు. అయినా బాధలేదని ఆమె చెప్పుకొచ్చారు. బీజేపీకి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. బీజేపీ ఇప్పటి వరకు రెండు జాబితాలను వెల్లడించింది. మొత్తం 88 స్థానాలకు పేర్లు ప్రకటించింది. ఇంకా రెండు స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: Dhavaleswaram Barrage: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక..

Exit mobile version