UP: ప్రియురాలి కోసం అర్ధరాత్రి గ్రామంలోకి ఎంట్రీ.. స్థానికులు ఏం చేశారంటే..!
- ప్రియురాలి కోసం అర్ధరాత్రి గ్రామంలోకి ఎంట్రీ
- దొంగగా భావించి స్థానికులు దేహశుద్ధి
- ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రియరాళ్ల కోసం ప్రేమికులు ఎంతకైనా తెగిస్తుంటారు. అర్ధరాత్రి.. అపరాత్రి అనకుండా చాటుగా వచ్చి కలిసి వెళ్తుంటారు. అదే ఓ ప్రేమికుడి పాలిట శాపమైంది. ప్రియురాలిని కలిసేందుకు గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే దొంగల కోసం కాపాలా కాస్తున్న స్థానికుల కంట్లో చిక్కాడు. ఇంకేముంది దొంగగా భావించి చితకబాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Amit Shah: మహాదేవ్ ఆపరేషన్‌తో పహల్గామ్ ఉగ్రవాదులు హతమయ్యారు
Also Read
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో అర్ధరాత్రి డ్రోన్ దొంగలు తిరుగుతున్నారని కలకలం చెలరేగింది. డ్రోన్ల ద్వారా ఇళ్లను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతున్నారన్న వార్తల నేపథ్యంలో దొంగల కోసం స్థానికులు కాపాలా కాస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన ఓ వివాహితతో పొరుగు ఊరుకు చెందిన యువకుడితో సంబంధం ఉంది. ఎవరికీ అనుమానం రాకుండా అర్ధరాత్రి ఆమెను కలిసేందుకు ఇద్దరు స్నేహితులతో ప్రేమికుడు గ్రామంలోకి వచ్చాడు. అంతే అప్పటికే దొంగల కోసం కనిపెడుతున్న గ్రామస్తులకు.. ఈ ముగ్గురు కంటపడ్డారు. ఇంకేముందు డ్రోన్ దొంగలుగా భావించి ఎటాక్ చేశారు. ప్రేమికుడు దొరికిపోగా.. మరో ఇద్దరు స్నేహితులు పరారయ్యారు. ప్రేమికుడిని పట్టుకుని చితకబాదారు.
ఇది కూడా చదవండి: Karnataka: ప్రభుత్వంలో ముసలం.. సిద్ధరామయ్య సమావేశాలకు డీకే.శివకుమార్ దూరం!
అయితే గ్రామంలోకి ఎందుకు వచ్చాడో విషయం తెలియజేయలేదు. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం అందించి అప్పగించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. డ్రోన్ దొంగల పుకారుతో పాపం అడ్డంగా బుక్కైపోయాడు.
తాజావార్తలు
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!